Ambati Rambabu: చంద్రబాబుపై వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్.

0
178

జైల్లో మామ అంబటిని కలిసిన అల్లుడు ఉపేష్

ఆవేశంలో అంబటి నోరు జారారని వ్యాఖ్య

 

అంబటికి సినిమా చూపిస్తామని పెమ్మసాని అనడం కరెక్ట్ కాదన్న ఉపేష్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు పశ్చాత్తాపం చెందుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ తెలిపారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అంబటిని సోమవారం మధ్యాహ్నం ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

టీడీపీ శ్రేణులే ముందుగా రెచ్చగొట్టేలా ప్రవర్తించారని, ఆ ఒత్తిడిలో అంబటి మాట జారారని ఉపేష్ ఆరోపించారు. సీఎంపై అసభ్యంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ, దాడులు చేయడం సరికాదన్నారు. అంబటికి సినిమా చూపిస్తామంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

 

గుంటూరులోని తమ ఇంటిపై పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త, అనుచరులు కలిసి దాడి చేశారని ఉపేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో నమోదైందని, వాటి ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. "ఏ పార్టీ కూడా ఎల్లప్పుడూ అధికారంలో ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలే పునరావృతం కావొచ్చు" అని ఆయన హెచ్చరించారు.

 

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయగా, గుంటూరు కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు, అంబటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడానికే తాను వెళ్లానని, దాడిని ప్రోత్సహించలేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఇప్పటికే వివరణ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే...
By Sidhu Maroju 2026-05-06 06:47:28 0 422
Telangana
మంచిర్యాల్:MLA ఇంటికి చేరుకున్న సీఎం
ఆసిఫాబాద్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి మంచిర్యాల్ ఎమ్మెల్యే శ్రీ...
By Bonagiri RaviShankar 2026-06-02 04:02:16 0 199
Andhra Pradesh
19న ఘనంగా ఉగాది వేడుకల నిర్వహణ:VZM కలెక్టర్
శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈనెల 19న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు...
By Boiena Rajesh 2026-03-17 13:18:26 0 240
Telangana
క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను నిలిపివేయాలి -రాజీవ్ రహదారి పై లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో -అనంతరం రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేత
రవాణా వాహనాలకు తప్పనిసరి చేసిన క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను ఉపసంహరించుకోవాలని, అలాగే...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-03-30 13:32:12 0 561
Jammu & Kashmir
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
By BMA ADMIN 2025-05-23 10:02:15 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com