డ్రగ్స్ పై దండయాత్ర

0
226

*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*

 

*పత్రికా ప్రకటన* *తేదీ. 01.02.2026*

 

 *🔴పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారి నేతృత్వంలో ఎన్.టి.ఆర్.జిల్లా పరిధిలో 35 రోజులపాటు డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు వేస్తూ డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో 510 కిలోమీటర్ల 🚴 సైకిల్ యాత్రలో బాగంగా ఈ రోజు డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత ఘనంగా కొనసాగుతున్న డ్రగ్స్ పై దండయాత్ర ఏడవ రోజు🚴 సైకిల్ యాత్ర కార్యక్రమం.*

 

*🔴ఈ రోజు సౌత్ ఏ.సి.పి. శ్రీ పావన్ కుమార్ గారు, ఎస్.ఆర్.పేట ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.డి.ఆలీ గార్ల ఆద్వర్యంలో సూర్యారావు పేట పోలీసు స్టేషన్ పరిదిలోని మదర్ తెరిస్సా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నందు సమావేశం ఏర్పాటు చేసి నర్సింగ్ విధ్యార్ధినులు మరియు ఎస్.టి.ఆర్.ఎం.సి. హై స్కూల్ విధ్యార్ధులకు అవగాహన కల్పించడం జరిగింది.*

 

*🔴 అనంతరం ఈ ఉధ్యమ సైకిల్ ర్యాలీ బి.ఆర్.టి.ఎస్. రోడ్డు నుండి మొదలై గులాబీ తోట, కొత్త వంతెన, దుర్గా అగ్రహారం, సాంబమూర్తి రోడ్డు, నక్కల రోడ్డు మీదుగా శ్రీధర్ కోచింగ్ సెంటర్ నందు భారీ సమావేశం ఏర్పాటు చేసి 1200 మంది విధ్యార్ధినీ విధ్యార్ధులతో డ్రగ్స్ వినియోగించడం వలన కలిగే నష్టాల గురించి మరియు ఎన్.డి.పి.ఎస్. చట్టాల గురించి వివరించడం జరిగింది.* 

 

*🔴ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు, ఈస్ట్ డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.గారు, అడ్మిన్ డి.సి.పి. శ్రీమతి కే.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, ఏ.డి.సి.పి. శ్రీ ఎం.బి.ఎం.మురళి కృష్ణ గారు, సౌత్ ఏ.సి.పి. శ్రీ పావన్ కుమార్ గారు, ఎస్.ఆర్.పేట ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.డి.ఆలీ గారు, టాస్క్ ఫోర్స్, ఈగల్ బృందం, శ్రీధర్ కోచింగ్ సెంటర్ అధికారులు మరియు 1200 మంది విద్యార్థినీ విధ్యార్ధులు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా పూర్తి చేయాలి: JC ఆదేశాలు.
మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శివ్...
By Pagadala Venkateswar 2026-02-19 06:45:45 0 241
Telangana
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది ...
By Ponnala Srinivasrao 2026-05-15 02:51:54 0 153
Andhra Pradesh
మదనపల్లె: బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు...
By Pagadala Venkateswar 2026-04-07 03:53:37 0 167
Telangana
మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య...
By MERIGE MALLESH 2026-03-26 05:36:46 0 415
Andhra Pradesh
కుందేరు ఆక్రమణలపై ఆరోపణలు… వెంచర్ల పేరుతో భూ దందా?
వేటపాలెం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని కేబి పార్క్‌ను ఆదారంగా...
By Vadlamudi NagaVenkat 2026-04-17 03:52:50 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com