Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు.

0
162

Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు

02-02-2026 Mon 06:44 | Andhra

High Court Remarks on Ambati Rambabus Wife Petition

రాజకీయాల్లో ఉన్నవారు వాడే భాష సభ్య సమాజం మెచ్చేలా ఉండాలన్న కోర్టు

శాంతిభద్రతలే కాదు, సామాజిక సామరస్యం కాపాడటం కూడా పోలీసుల విధి అని వ్యాఖ్య

 

అంబటి రాంబాబు భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ

భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పడంతో కేసు ముగింపు

రాజకీయ నాయకులు వాడే భాషపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇతరులను కించపరిచేలా లేదా వివాదాలకు దారితీసేలా ఉండకూడదని స్పష్టం చేసింది. రాజకీయ నేతలు వాడే పదజాలం హుందాగా ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

 

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటి వద్ద రక్షణ అవసరమని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాజకీయాల్లో పెరుగుతున్న భాషా కాలుష్యంపై కోర్టు స్పందించింది.

 

కేవలం నేరాలను అదుపు చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడమే పోలీసుల పని కాదని కోర్టు గుర్తుచేసింది. సమాజంలో వివిధ వర్గాల మధ్య శాంతిని, సామరస్యాన్ని పెంపొందించాల్సిన గురుతర బాధ్యత కూడా పోలీసు వ్యవస్థపై ఉందని వ్యాఖ్యానించింది.

 

అంబటి రాంబాబు కుటుంబానికి ఇప్పటికే తగిన భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం, సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్‌ను పరిష్కరించినట్టు తెలిపింది.

Search
Categories
Read More
Sports
హైదరాబాద్ లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ
భారతదేశంలో రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) రెండవ ఎడిషన్ 2026, జూన్ 16 నుండి జూన్ 28...
By Avunoori Mahesh 2026-04-18 17:07:02 0 244
Telangana
మంచిర్యాలలో TVS ఈ-వెహికల్ షోరూమ్ ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Avunoori Mahesh 2026-09-02 10:44:04 0 146
Andhra Pradesh
మన ఊరి మాట మంతి కార్యక్రమం
కాకినాడ మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో శ్రీ Pawan Kalyan గారి ప్రసంగం   • సమాజంలో...
By Chennaiah Kati 2026-06-20 17:40:51 0 127
SURAKSHA
S. Suhas, IAS: A Visionary Leader Driving Inclusive Governance
The Journey Begins "Good governance is about making every citizen feel...
By Fathima Safa 2026-07-15 11:48:25 0 132
Andhra Pradesh
పుంగనూరు: మాజీ సీఎంను కలిసిన యువ నాయకులు
గురువారం విజయవాడలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని...
By Kothuru Murali 2026-04-03 09:41:04 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com