"నిఘా నీడలో నిందితులు: నల్లబజారు దందాలపై పోలీసుల నిరంతర నిఘా.|

0
208

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న ఒక ముఠా ఉదంతం కలకలం రేపింది.

ఉప్పల్ అసిస్టెంట్ సివిల్ సప్లై కార్యాలయ నాయబ్ తహసీల్దార్ గంగిరెడ్డి ప్రదీప్ కుమార్ నేతృత్వంలో, ఆల్వాల్  ఎస్ హెచ్ ఓ  సూచనలతో హస్మత్‌పేట అంజయ్య నగర్ వద్ద  పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. 

ఈ తనిఖీల్లో భాగంగా అటుగా వెళ్తున్న TS34TA8006 నంబర్ గల బొలేరో వాహనాన్ని నిలిపి సోదా చేయగా, అందులో భారీగా గృహ అవసరాలకు వాడే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యాయి.

వాహనంలో ఉన్న మొత్తం 69 ఇండియన్ గ్యాస్ సిలిండర్లలో 14 నిండుగా ఉండగా, మిగిలిన 55 ఖాళీ సిలిండర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ సంఘటనపై ఎస్సై తరుణ్ రెడ్డి మాట్లాడుతూ... పట్టుబడిన స్టాక్‌కు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేవని, వీటిని నల్లబజారులో అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు తమ విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు.

సామాన్య ప్రజలకు సబ్సిడీపై అందాల్సిన గ్యాస్ సిలిండర్లను ఇలా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకోవడం నేరమని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన అనిల్ సావన్ మరియు అనిల్ కిలేర్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

స్వాధీనం చేసుకున్న సిలిండర్లను అల్వాల్‌లోని హిందుస్థాన్ గ్యాస్ కంపెనీకి తరలించి, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. 

ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
Vaibhav Galriya IAS: Transforming Rajasthan Finance
A 1998-batch Rajasthan cadre IAS officer, Vaibhav Galriya has earned a reputation as one of the...
By Lokeshwari Panthadi 2026-08-01 05:45:20 0 116
Andhra Pradesh
Chandrababu Naidu: లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు... నా పని నేను చేస్తున్నా: సీఎం చంద్రబాబు.
పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు  ...
By Pagadala Venkateswar 2026-02-15 06:23:40 0 199
Andhra Pradesh
పుంగునూరు :పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
పుంగనూరు పట్టణ పరిధిలోని తాటిమాకులపాళ్యంకు చెందిన భానుమూర్తి ఆచారి (31) అనే యువకుడు ఇంటి నుంచి...
By Kothuru Murali 2026-05-09 14:50:50 0 144
Andhra Pradesh
విజయనగరం జిల్లాలో కుంకి ఏనుగులు
అటవీ ఏనుగుల గుంపును మన్యం జిల్లా గుచ్చిమి వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫ్యాంట్ జోన్కు తరలించేందుకు...
By Boiena Rajesh 2026-08-11 03:33:14 0 109
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లోఈనెల 24 నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల...
By Kothuru Murali 2026-02-14 08:05:54 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com