విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు.

0
128

తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన ఏపీ సీఎం

విజయ్ అద్భుత విజయం సాధించారని కొనియాడిన చంద్రబాబు

తమిళ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆకాంక్ష

తమిళనాడులో 107 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన నటుడు విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ప్రభంజనం సృష్టించడంపై చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

 

ఈ సందర్భంగా విజయ్‌ని ప్రశంసిస్తూ చంద్రబాబు ఒక పోస్ట్ చేశారు. "తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు విజయ్‌కు నా అభినందనలు. తమిళనాడు ప్రజలకు సేవ చేయడంలో, వారి పురోగతి, శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సంపూర్ణంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే అద్భుతమైన ఫలితాలు సాధించిన విజయ్‌కు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
Hyderabad Metro Expansion Driving Urban Growth Forward
The expansion of the Hyderabad Metro is playing a significant role in transforming the city's...
By Fathima Safa 2026-06-20 10:35:16 0 280
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీ కి ట్రిపుల్ఐటీ బాసరలో సీటు.....!
మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీకి ట్రిపుల్ఎటీ బాసరలో సీటు.   భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-06-01 15:00:03 0 216
SURAKSHA
​. 'CEN' Wings for Tackling Cyber Crime
To combat growing digital threats, Karnataka Police established dedicated 'CEN' (Cyber, Economic,...
By Kalaga Sailaja 2026-06-29 11:47:22 0 269
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సదుంలో చామంతి తోటను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చింతపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ...
By Kothuru Murali 2026-03-01 16:32:19 0 184
Andhra Pradesh
మదనపల్లెలో అత్యాధునిక శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె ప్రజలకు శుభవార్త. అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీ సాయి మల్టీ...
By Pagadala Venkateswar 2026-02-27 09:10:34 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com