Gold Price Drop: కొనసాగుతున్న బంగారం ధరల పతనం... ఈరోజు రూ.9 వేలు ఢమాల్

0
719

Gold Price Down | బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. తులం బంగారం రూ.9 వేలు పడిపోతే, కిలో వెండిపై ఏకంగా రూ.20 వేలు పతనమైంది. నిన్న ఆదివారం కావడంతో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇవాళ సోమవారం మార్కెట్లు తెరుచుకోగానే బంగారం, వెండి ధరలు ఢమాల్ అన్నాయి.బంగారం, వెండి ధరలు ఎంత వేగంగా రికార్డులు సృష్టించాయో, అంతే వేగంగా పతనం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పతనం కావడంతో ఆ ప్రభావం ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో కనిపిస్తోంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఢమాల్ అని పడిపోయాయి. ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ ధర ఏకంగా రూ.9,050 పతనమైంది. రూ.1,60,580 నుంచి రూ.1,51,530కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.8,300 పతనమైంది. రూ.1,47,200 నుంచి రూ.1,38,900కి చేరుకుంది. ఇక 18 క్యారట్ గోల్డ్ ధర రూ.6,790 పడిపోయింది. రూ.1,20,440 నుంచి రూ.1,13,650కి చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రంగత నాలుగు రోజుల్లో బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. స్వచ్ఛమైన బంగారం ధర రూ.27,320 పడిపోగా, 22 క్యారట్ బంగారం ధర రూ.25,050 పడిపోయింది. బంగారం ధరల లాగే వెండి ధరలు కూడా పతనం అయ్యాయి. కిలో వెండిపై ఇవాళ ఏకంగా రూ.20,000 పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి రూ.3,20,000 నుంచి రూ.3,00,000కి పడిపోయింది. తులం వెండి రూ.3,000కి కొనొచ్చు. నాలుగు రోజుల్లో కిలో వెండి ధర రూ.1,25,000 పడిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)ఇక మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 2.26 శాతం అంటే రూ.3,217 తగ్గి రూ.1,39,000 ధరలో ట్రేడ్ అవుతుండగా, సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 6.52 శాతం అంటే రూ.17,322 తగ్గి రూ.2,48,330 ధరలో ట్రేడ్ అవుతుంది. గత వారం అంతర్జాతీయ మార్కెట్‌లో 5500 డాలర్లు దాటిన ఔన్స్ బంగారం ధర ఇప్పుడు 4500 డాలర్ల వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం 4675 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఔన్స్ వెండి ధర 79.45 డాలర్లకు లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తదుపరి ఫెడరల్ రిజర్వ్ చైర్‌గా కెవిన్ వార్ష్‌ను ఎంపిక చేయడంతో ఇన్వెస్టర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీనివల్ల డాలర్ బలం పెరగడం మెటల్స్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. శుక్రవారం బాగా తగ్గిన బంగారం ధరలు మళ్ళీ కొంచెం పుంజుకున్నాయి. అయితే డాలర్ బలంగా ఉండటంతో బంగారంపై ఒత్తిడి అలాగే ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరగడం చూస్తుంటే వ్యాపారుల్లో ఒక రకమైన ఆశ కనిపిస్తోంది. సోమవారం వెండి ధరలు 8 శాతానికి పైగా పెరిగాయి. అంతకుముందు సెషన్‌లో వెండి 12 శాతం వరకు పడిపోయి మళ్ళీ ఇలా కోలుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)సిఎమ్ఈ ప్రిషియస్ మెటల్స్ మార్జిన్ రిక్వైర్మెంట్స్ పెరగడం సోమవారం బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం అయ్యింది. మరోవైపు కెవిన్ వార్ష్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ఇంపోర్ట్ డ్యూటీలు, టాక్సులు ఇంకా ఎక్స్ఛేంజ్ రేట్లలో మార్పులు ఇండియాలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలన్నీ కలిసి మన దేశంలో ప్రతిరోజూ ఉండే బంగారం రేట్లను నిర్ణయిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)భారతదేశంలో బంగారానికి సాంప్రదాయకంగా ఇంకా ఆర్థికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లిళ్లు, పండుగల సమయంలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు మార్కెట్ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఇలాంటి వేగవంతమైన మార్పులను అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం చాలా అవసరం. పెట్టుబడి ఏదైనా సరే మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీ సంపదను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Search
Categories
Read More
Andhra Pradesh
మే 9న మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్ర.
మదనపల్లెలో మే 9న హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ చైతన్య వేదిక నేతలు బాలాజీ, మధు...
By Pagadala Venkateswar 2026-04-11 06:23:29 0 139
Andhra Pradesh
పుంగనూరు: నిబంధనల మేరకే పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి మండలాలలో సోమవారం తహసిల్దార్లు పార్వతి,...
By Kothuru Murali 2026-04-28 06:32:05 0 144
Telangana
పంట కోత మాటున.. బంగారు గొలుసుల కోత.|
● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా ● ముగ్గురు అరెస్ట్.. 8...
By Sidhu Maroju 2026-07-29 16:21:23 0 273
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం లో శ్రీ లక్ష్మి కల్యాణ మండపం లో...
By Sadaq Sadaq 2026-05-25 05:42:39 0 136
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 2వతారికు వైన్సులు బ్యాండ్
జిల్లాలో 2వతరికున వైంసులు బంద్కనునాయి. హముమాన్‌జయంతి నేపత్యం లో శాంతిభద్రతాల దృష్టియా జిల్లా...
By Sadaq Sadaq 2026-03-31 17:28:11 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com