Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్ట్.

0
182

Andhra

Ambati Rambabu Arrested for Remarks Against Chandrababu Naidu

సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి అరెస్ట్

టీడీపీ నేత బాజీ చౌదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

 

అంబటి ఇంటి వద్ద 6 గంటలకు పైగా టీడీపీ శ్రేణుల నిరసన, ఆందోళన

తీవ్ర ఉద్రిక్తతల మధ్య అంబటిని వజ్రవాహనంలో తరలించిన పోలీసులు

అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ మంత్రులు, నేతలు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని నవభారత్ నగర్ లోని నివాసం నుంచి ఆయనను తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసు వాహనంలోకి ఎక్కించి తరలించారు.

 

వివరాల్లోకి వెళితే, గుంటూరులో తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై స్పందిస్తూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రమైన, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులోని అంబటి నివాసం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దాదాపు 6 గంటలకు పైగా నిరసన కొనసాగింది. ఈ క్రమంలో ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

 

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ప్రత్యేక వజ్రవాహనంలో అక్కడి నుంచి తరలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

 

అంబటి వ్యాఖ్యలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, హోం మంత్రి అనిత, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. అంబటి వ్యాఖ్యలు 'దుర్మార్గం', 'నీచం' అని అభివర్ణిస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
A. Jayathilak IAS: Driving Kerala's Growth with Vision
The Journey begins "The true measure of governance lies not in policies alone, but in the...
By Fathima Safa 2026-07-14 07:26:29 0 363
Telangana
ఆకలా వర్షం ఉరుముల మెరుపులతో రాళ్ళ వర్షం
తలకొండపల్లి మండలంలోని చౌదరపల్లి గ్రామంలో అకాల వర్షం కురిసింది ఉరుముల మెరుపులు రాళ్లు తో కూడిన...
By MERIGE MALLESH 2026-04-21 11:34:41 0 721
Andhra Pradesh
అమ్మవారిని దర్శించుకున్న నీట్ ఆయోగ్ బివిఆర్ సుబ్రహ్మణ్యం
నీతి ఆయోగ్ (NITI Aayog) సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన...
By Rajini Kumari 2026-02-05 07:36:56 0 197
Telangana
అభివృద్ధిలో దూసుకుపోతున్న గండిమైసమ్మ X రోడ్
గండిమైసమ్మ X రోడ్ హైదరాబాద్‌లోని బాచుపల్లి - దుండిగల్ ప్రధాన రహదారిపై ఉన్న ఒక ప్రముఖ మరియు...
By Ponnala Srinivasrao 2026-03-14 03:16:09 0 300
West Bengal
8th Pay Commission: Kolkata Outreach and Consultations
In a significant move for government employees, the 8th Pay Commission is set to commence its...
By Lokeshwari Panthadi 2026-07-03 05:13:27 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com