Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.

0
184

మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు పట్టుకున్న వైనం

నిందితుడి నేరాల చిట్టా వివరించిన రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీకాంత్ 

 

గోదావరిలో పుణ్య స్నానాల కోసం అంటూ మహిళలను పిలిపించి నగలతో ఉడాయిస్తున్న వైనం

మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా నేరస్తుడిని తూర్పు గోదావరి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీకాంత్ సదరు మోసగాడి నేరాల చిట్టాను వివరించారు. 

 

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పి.వడ్డురు గ్రామానికి చెందిన చల్లా నారాయణ (అలియాస్ నారాయణ కృష్ణ, అలియాస్ కృష్ణ నారాయణ) వివిధ పేర్లతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో ఖాతాలు తెరిచి వితంతు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. తాను గోవాలో బంగారు వ్యాపారి అని చెప్పుకుంటూ వివాహ ప్రతిపాదనలు పంపి, మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. ఆ తర్వాత జాతకంలో దోషాలు ఉన్నాయని, రాజమహేంద్రవరం వచ్చి గోదావరిలో పుణ్యస్నానం చేసి పూజలు చేస్తే అన్నీ సరిచూసుకుంటాయని నమ్మించేవాడు. అలాగే బంగారు నగలు ధరించి వస్తే తన తల్లిదండ్రులకు కూడా నచ్చుతారని మాయమాటలు చెప్పి మహిళలను రాజమహేంద్రవరం రప్పించేవాడు. ఇక్కడ స్నానాలు పూర్తయ్యాక పూజా సామగ్రి తెస్తానని చెప్పి, వారు తీసుకొచ్చిన నగలు, విలువైన వస్తువుల బ్యాగ్‌తో పరారయ్యేవాడు. 

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లె: యువత గాంజా, మత్తుకు బానిస కావద్దు: ఎస్సై.
నిమ్మనపల్లె ఎస్సై రామకృష్ణ ఆదివారం యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువత గాంజా, మత్తు పదార్థాలకు...
By Pagadala Venkateswar 2026-06-22 06:48:32 0 115
Andhra Pradesh
రూ.32,52,064 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. - కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. - కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. - కార్యకర్తలకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి...
By Ratna Sekhar 2026-03-11 07:08:32 0 554
Goa
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and Alleged Corruption
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and...
By BMA ADMIN 2025-05-21 08:54:16 0 2K
Andhra Pradesh
శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి R...
By Kola Kirankumar 2026-03-27 08:18:19 0 551
Andhra Pradesh
ఇంటిని కబ్జా చేశారని ఆవేదన.
తన ఇంట్లోకి చొరబడి, తనను బయటకు గెంటేసి ఇంటిని కబ్జా చేశాడని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి...
By Pagadala Venkateswar 2026-03-17 03:17:18 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com