YSR Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో 227 గన్ లైసెన్సులు రద్దు.

0
380

ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు లైసెన్స్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు

జిల్లాలో జారీ చేసిన మొత్తం 854 తుపాకీ లైసెన్స్‌లను సమగ్రంగా పరిశీలించిన అధికారులు

 

జిల్లా ఎస్పీ సిఫార్సుతో 227 లైసెన్సులను రద్దు చేసిన కలెక్టర్

గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇష్టానుసారంగా జారీ చేసిన గన్ లైసెన్సులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు లైసెన్స్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో సమగ్ర విచారణ చేపట్టి, 227 తుపాకీ లైసెన్స్‌లను ఉన్నతాధికారులు రద్దు చేశారు. 

 

లైసెన్స్‌లు పొందిన కొందరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డారని, తుపాకులు చూపిస్తూ బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయం మీడియాలో రావడంతో ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి, జిల్లాలో జారీ చేసిన మొత్తం 854 తుపాకీ లైసెన్స్‌లను సమగ్రంగా పరిశీలించారు. అర్హతలేమి, నేరపూరిత నేపథ్యం ఉన్నవారికి లైసెన్స్‌లు ఇచ్చారా అనే అంశాలపై విచారణ జరిపారు. 

 

ఈ విచారణలో దాదాపు 227 మంది లైసెన్స్‌దారులు వివిధ నేరాల్లో పాల్గొన్నట్లు తేలింది. వారిలో 11 మంది కరుడుగట్టిన నేరస్తులుగా గుర్తించగా, మరో ముగ్గురు నిబంధనలు ఉల్లంఘించి తుపాకులతో నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. దీంతో 227 గన్ లైసెన్స్‌లను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఎస్పీ సిఫార్సు చేయగా, కలెక్టర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. 

 

తుపాకీ లైసెన్స్‌లు రద్దయినవారిలో జమ్మలమడుగుకు చెందిన వైసీపీ నేత మల్కిరెడ్డి హనుమంతరెడ్డి, పులివెందులలో కాల్పుల ఘటనలో ఉన్న భరత్ యాదవ్, వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెకు చెందిన నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే కమలాపురం మండలం అప్పాయపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ ఎం. శ్రీనివాసులరెడ్డి, కడప పట్టణం ఎస్‌బీఐ కాలనీకి చెందిన షేక్ జాకీర్ లైసెన్స్‌లను కూడా రద్దు చేశారు. పులివెందుల, కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో తుపాకీ లైసెన్స్‌లు రద్దయినట్లు తెలుస్తోంది. 

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Expands Renewable Energy for Sustainable Growth
Jharkhand has continued to advance its renewable energy sector in 2026 by promoting solar power...
By Fathima Safa 2026-07-01 09:57:39 0 197
West Bengal
West Bengal Enhances Border Security and Trade Ties
West Bengal continues to strengthen border security and deepen cooperation with Bangladesh...
By Fathima Safa 2026-07-02 05:52:28 0 101
Andhra Pradesh
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుండి 50 కుటుంబాలకు పైగా సుమారు 200 మంది కర్నూల్ పార్లమెంట్ వైస్...
By Boya Dasthagiri 2026-03-31 11:36:31 0 232
BMA
RTI Stonewalling: Bureaucracies Denying Public Data
The Right to Information (RTI) mechanism, once a powerful tool for investigative journalists, is...
By JoinBMA 2026-08-21 04:40:49 0 163
SURAKSHA
N. Prasanth IAS: Inspiring Governance Through Innovation
The Journey Begins "Technology should make governance simpler, faster, and...
By Fathima Safa 2026-07-14 07:54:15 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com