శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు - కేసు డైరీలు రికార్డుల క్షుణ్ణ పరిశీలన!

0
317

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు, రికార్డుల క్షుణ్ణ పరిశీలన!

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగాజిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు యర్రగొండపాలెం సర్కిల్ పరిధిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో యర్రగొండపాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) గారు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడి కేసు డైరీలు (CD Files), స్టేషన్ రికార్డులు మరియు విధి నిర్వహణ విధానాలను సవివరంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని, కేసుల పురోగతిని వేగవంతం చేయాలని సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు.

అదేవిధంగా CI గారు దోర్నాల పోలీస్ స్టేషన్‌ను కూడా సందర్శించి, స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ నాన్-బెయిలబుల్ వారెంట్లు (NBWs) తదితర అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై చట్టబద్ధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల ఫిర్యాదులకు వేగంగా స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పోలీస్ స్టేషన్లలో రికార్డుల సముచిత నిర్వహణ, కేసుల పర్యవేక్షణ ద్వారా శాంతిభద్రతలు మరింత మెరుగుపడతాయని CI గారు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంచే విధంగా ప్రతి అధికారి, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
JKSA: కర్నూలు నర్సింగ్ కాలేజీలో కశ్మీరీ విద్యార్థినులపై వేధింపులు.. సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు.
సీఎం చంద్రబాబు జోక్యం కోరుతూ జేకే స్టూడెంట్స్ అసోసియేషన్ లేఖ రంజాన్ ఏర్పాట్లు, హిజాబ్‌పై...
By Pagadala Venkateswar 2026-02-27 10:44:12 0 175
Andhra Pradesh
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ప్రసాదాల పంపిణీ
*ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ప్రసాదాలు పంపిణీ*...
By Rajini Kumari 2025-12-30 12:27:45 0 229
Andhra Pradesh
డిల్లీ కి డోమ్... శత్రువుల గుండెల్లో రైళ్లు...
డిల్లీ రక్షణ కోసం కేంద్రం క్యాపిటల్ డోమ్ పేరు తో రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. శత్రువుల...
By Karapati Gopi 2025-12-28 03:25:49 0 439
Andhra Pradesh
పుంగనూరులో ఆలయ అంగడి గదుల కూల్చివేత, భక్తుల ఆందోళన
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో 30 ఏళ్ల క్రితం దాతలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దానం...
By Kothuru Murali 2026-04-09 07:31:58 0 161
Andhra Pradesh
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల...
By Chennaiah Kati 2026-07-23 10:31:55 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com