Chandrababu Naidu: ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు.

0
377

Chandrababu Naidu: ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు

30-01-2026 Fri 14:07 | Andhra

Chandrababu Naidu Hails APs iGOT Karmayogi Achievement

'ఐగాట్ కర్మయోగి' ప్లాట్‌ఫామ్‌లో ఏపీ సరికొత్త రికార్డు

కోటికి పైగా ఎన్‌రోల్‌మెంట్లు పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఘనత

ప్రభుత్వ ఉద్యోగుల నిబద్ధతను కొనియాడిన సీఎం చంద్రబాబు

నైపుణ్యం గల పరిపాలన కోసమే ఈ కార్యక్రమమని వెల్లడి

ఈ ఘనతలో ఏపీఎస్‌డీపీఎస్‌ పాత్రను అభినందించిన సీఎం

ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే 'ఐగాట్ కర్మయోగి' పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌పై కోటికి పైగా కోర్సు ఎన్‌రోల్‌మెంట్లు, 80 లక్షలకు పైగా కోర్సుల పూర్తితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఉద్యోగులు మొత్తం 4,290 కోర్సులలో ఈ శిక్షణ పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థను (APSDPS) సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

 

కేంద్ర ప్రభుత్వం సైతం ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ ఘనతను ప్రశంసించింది. ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పౌర సేవలపై సానుకూల ప్రభావం చూపడంలో రాష్ట్రం ముందుందని కొనియాడింది. ఏపీ సాధించిన ఈ విజయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని పెంపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతకు ఇది నిలువుటద్దమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...
By Kothuru Murali 2025-12-26 06:13:47 0 250
Andhra Pradesh
దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Davos Tour Day 1*   *Press Release 5*   *ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌...
By Rajini Kumari 2026-01-20 10:24:40 0 208
Telangana
మదర్ థెరెసా జయంతి: నివాళులు అర్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ జిల్లా:  కంటోన్మెంట్.     కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ...
By Sidhu Maroju 2025-08-26 08:20:03 0 518
Andhra Pradesh
గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ...
By John Baji 2026-01-22 01:35:32 0 256
Andaman & Nikobar Islands
Education and Skill Development Gain New Momentum
Education and skill development continue to receive significant attention in the Andaman &...
By Fathima Safa 2026-06-27 10:41:00 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com