Anagani Satya Prasad: ఏపీలో 22 ఏ భూముల సమస్య పరిష్కారానికి త్వరలో విధాన ప్రకటన: మంత్రి అనగాని.

0
169

రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడి

రీసర్వేలో రైతులను భాగస్వామ్యం చేయాలన్న మంత్రి అనగాని

22ఏ భూ సమస్యలపై రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా త్వరలో విధాన ప్రకటన చేయనున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూసమస్యలకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. 

 

సీసీఎల్‌ఏ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మంత్రివర్గ ఉప సంఘంలో 22ఏ భూములపై చర్చ జరిగిందని, ఉన్నతాధికారులు విధానం రూపొందించిన తర్వాత ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని, వాటిని మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. 

 

ఫిబ్రవరి 2 నుంచి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టాలని, వాటిలో ఎలాంటి తప్పులు ఉండకూడదని స్పష్టం చేశారు. రీసర్వేలో గత తప్పులు పునరావృతం కాకుండా రైతులను భాగస్వాములుగా చేయాలని మంత్రి ఆదేశించారు. రీసర్వే గడువును 140 రోజులకు పెంచుతూ కొత్త ఎస్‌ఓపీ విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు అందుబాటులో లేకుంటే సర్వే వాయిదా వేసి, వారి సమక్షంలోనే నిర్వహించాలని సూచించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ ధీరజ్.
మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-05-05 06:17:11 0 122
SURAKSHA
పోలీస్ శిక్షణతో యువతకు ఉపాధి - AP స్కిల్ డెవలప్మెంట్ మిషన్
నిరుద్యోగ యువతకు చేయూత ఇచ్చేందుకు AP పోలీస్ "యువశక్తి" స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుపుతుంది....
By Kalaga Sailaja 2026-07-01 10:09:26 0 90
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:25 0 181
Telangana
SKY ROOT AEROSPACE VIKRAM 1 Rocket flag off ceremony
స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు Revanth Reddy స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో...
By G k Nookala 2026-04-25 10:20:47 0 228
Telangana
దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన
కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన...
By Ponnala Srinivasrao 2026-05-09 02:16:23 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com