హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|

0
262

హైదరాబాద్ :  హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో నగరవాసులు గాలి తీసుకోవడానికే భయపడే పరిస్థితి నెలకొంది.

దక్షిణ భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలైన బెంగుళూరు, చెన్నై లను అధిగమించి హైదరాబాద్ అత్యంత కలుషిత నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తోంది.

 

ప్రమాదకరస్థాయిలో సికింద్రాబాద్ :

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, సికింద్రాబాద్ పరిధిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అత్యంత ప్రమాదకరంగా 240 కి చేరుకుంది. ఈ స్థాయి కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

 

ముఖ్యమైన వివరాలు:

3 నుండి 4 రెట్లు అధికం. గాలిలో ఉండే సూక్ష్మ ధూళి కణాలు, (pm. 2.5. మరియు pm 10) అనుమతించిన స్థాయి కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

 

బెంగుళూరు, చెన్నై కంటే అద్వాన్నం :

వాతావరణ పరిస్థితులు, వాహనాల కాలుష్యం కారణంగా, మన నగరం ఇతర మెట్రో నగరాల కంటే ఎక్కువ భారాన్ని మోస్తోంది. 

 

శ్వాసకోశ వ్యాధుల ముప్పు :

గాలిలో కాలుష్య స్థాయి పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

అధికారుల హెచ్చరిక:

నిర్మాణరంగ కార్యకలాపాలు, విపరీతమైన వాహనాల రద్దీ, మరియు చలికాలంలో ఉండే స్థిరమైన వాతావరణం వల్ల కాలుష్య కణాలు భూమికి దగ్గరగా ఉండిపోతున్నాయి.

తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TSPCB) ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిఘా పెంచి, కాలుష్య నివారణ చర్యలపై సమీక్షిస్తోంది.

 

SIDHUMAROJU✍️

Alwal

Search
Categories
Read More
BMA
Newsroom Wellbeing: Breaking Free from 24/7 Burnout
The relentless demand to publish breaking news every few minutes has created an unprecedented...
By JoinBMA 2026-08-24 05:57:27 0 245
Andhra Pradesh
రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో...
By Pagadala Venkateswar 2026-04-10 06:02:53 0 138
SURAKSHA
S. J. M. Gillani, IPS: Leading with Courage & Commitment
A Distinguished IPS Officer Strengthening Law Enforcement, Internal Security, and Public Trust in...
By Lokeshwari Panthadi 2026-07-17 10:26:04 0 133
Andhra Pradesh
పుంగనూరు: పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్...
By Kothuru Murali 2026-02-03 05:25:32 0 203
Andhra Pradesh
చెంబకూరులో వ్యక్తి మృతి.. పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన.
శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం నారమాకులతాండాకు చెందిన రైతు చిన్న బుడ్డానాయక్ (38) గుర్తుతెలియని...
By Pagadala Venkateswar 2026-06-20 04:36:55 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com