Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం.

0
175

Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం

28-01-2026 Wed 13:13 | Andhra

Ajit Pawar Death AP Cabinet Condolences

 

భేటీ ప్రారంభంలో పవార్ మరణాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు

సంతాపం తెలిపిన మంత్రిమండలి

కేబినెట్ లో సంతాప తీర్మానం

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సంతాపం తెలిపింది. ఈ రోజు ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో సంతాప తీర్మానం చేసింది. భేటీ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అజిత్ పవార్ విమాన ప్రమాద వార్తను ప్రస్తావించారు. ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంపై విచారం వ్యక్తం చేశారు.

 

ప్రమాద విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చంద్రబాబు చెప్పారు. అజిత్ పవార్ తో తనకున్న పరిచయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. అజిత్‌ పవార్‌ మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటని చంద్రబాబు అన్నారు. అజిత్ పవార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మంత్రులు మౌనం పాటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో "ఆపరేషన్ క్లీన్ స్విప్పు" ప్రారంభం
మదనపల్లిని పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ "ఆపరేషన్ క్లీన్...
By Pagadala Venkateswar 2026-05-24 07:39:22 0 152
Telangana
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టులో పిటిషన్.|
● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ. ● విచారణ ఆగస్టు 11కు వాయిదా. హైదరాబాద్, జులై 20 :...
By Sidhu Maroju 2026-07-20 17:34:15 0 200
Andhra Pradesh
టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం
టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం: ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు; ...కర్మ రిటర్న్-ఎమ్మెల్యే...
By Chennaiah Kati 2026-07-03 09:50:05 0 94
Andhra Pradesh
పుంగనూరు: దాడి కేసులో నిందితులకు జైలు శిక్ష
పుంగనూరుకు చెందిన యేసు, మరో ఇద్దరికి మదనపల్లి కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష...
By Kothuru Murali 2026-04-08 07:48:32 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com