జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టులో పిటిషన్.|

0
199

● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ.

● విచారణ ఆగస్టు 11కు వాయిదా.

హైదరాబాద్, జులై 20 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

వార్డుల సరిహద్దులను నిబంధనల ప్రకారం తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

1996 జీవో నంబర్ 570లోని రూల్-5 ప్రకారం డీలిమిటేషన్ జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని నిర్వహించాల్సి ఉండగా, ఆ నిబంధనలను పాటించలేదని వాదించారు. 

అలాగే తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019లోని సెక్షన్-6 నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు...
By Ponnala Srinivasrao 2026-04-28 01:27:38 0 152
Andhra Pradesh
పుంగనూరు: చెట్టును ఢీకొని బోల్తాపడ్డ ఆటో
అన్నమయ్య జిల్లా, పుంగునూరు మండలం, రాంపల్లె వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె...
By Kothuru Murali 2026-05-13 18:37:52 0 131
Andhra Pradesh
నిరంతరాయమైన విద్యుత్ ను అందిచడమై లక్ష్యం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే MMకొండయ్య.
చీరాల: విద్యుత్ రంగానికి కూటమి సర్కార్ పెద్ద పీట. నూతనంగా నిర్మించనున్న విద్యుత్...
By Gadiyapudi Narendra 2026-02-18 15:57:06 0 222
Andhra Pradesh
3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ...
By John Baji 2025-12-30 13:10:58 0 227
SURAKSHA
Shri M. Chawla, IPS: A Lifetime of Courage and Public Service
A distinguished IPS officer whose unwavering commitment to ethical policing, crime prevention,...
By Kalaga Sailaja 2026-07-31 14:44:50 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com