మహిళల భద్రతకు శక్తివంతమైన ఆయుధం – శక్తి యాప్ : ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రకాశం జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమం

0
258

మహిళల భద్రతకు శక్తివంతమైన ఆయుధం – శక్తి యాప్ : ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రకాశం జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమం

 ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు మహిళల భద్రత, రక్షణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు శక్తి యాప్ (Shakthi App) పై అవగాహన కార్యక్రమాన్ని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ – టీమ్–1 మరియు టీమ్–2 సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బస్టాండ్‌కు వచ్చే మహిళలు, యువతులు, ప్రయాణికులకు శక్తి యాప్ ఉపయోగాలు వివరించి, వారి మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.

పోలీసులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో ఒక్క బటన్ నొక్కితే వెంటనే పోలీస్ సహాయం అందే విధంగా శక్తి యాప్ రూపొందించబడిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా మహిళల లైవ్ లొకేషన్, ఆడియో రికార్డింగ్, అత్యవసర అలర్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరుతాయని వివరించారు.

ప్రత్యేకంగా పని నిమిత్తం ప్రయాణించే మహిళలు, విద్యార్థినులు శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించాలని సూచించారు. 

మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల నివారణలో శక్తి యాప్ ఎంతో కీలకమని తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమానికి ప్రయాణికులు సానుకూల స్పందన తెలియజేస్తూ, శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మహిళల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట హైదరాబాద్ కు వెళ్లిన కేటీఆర్ మరియు హరీష్ రావు...
భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి...
By Gujile Ramu 2026-07-26 07:41:56 0 185
Telangana
గుండి గ్రామంలో రేపు వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్‌కు ఆహ్వానం
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ఈ...
By Chunarkar Jagadeesh 2026-09-14 11:35:02 0 132
Telangana
ఎండ వాన లెక్కచేయని మున్సిపల్, జీపీ కార్మికులు
కొంమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండను, వానను లెక్కచేయకుండా, తెల్లవారకముందే విధులకు హాజరవుతూ వీధుల...
By Chunarkar Jagadeesh 2026-06-30 07:21:30 0 253
SURAKSHA
Community Policing: Police with People Program
: Tamil Nadu Police follows community policing to build public trust. Monthly ‘Makkaludan...
By Kalaga Sailaja 2026-07-02 08:11:09 0 156
Telangana
మహ్మదాపురం సోసైటీ చైర్మన్ గా ఇంగోలి రాజేశ్వరరావు గారు ఎన్నిక కావడం జరిగింది
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం సొసైటీ ఛైర్మన్గా హింగోలి...
By Gujile Ramu 2026-07-03 13:19:50 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com