నకిలీ ఆయిల్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు...

0
663

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారున అక్రమంగా తయారీ చేస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు.

ఎస్సై లక్మి కాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీ పాల్పడుతున్న నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుండి 15 నకిలీ ఆయిల్ డబ్బాలను,తయారీ ఉపయోగిస్తున్న 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలు,తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో డిఎస్పి శ్రీహరి రాజు మాట్లాడుతూ అక్రమ ధనార్జన ధ్యేయంగా FK పాలెం గ్రామానికి చెందిన బండారు ఫణి ప్రసాద్, ధర్మవరం శివారున జంతువుల కొవ్వు,క్రూడ్ ఆయిల్ కలిపి మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేసి,ఇచ్చాపురంకి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్,యజమాని సంతోషి శ్రీనివాస్ దాస్ ,రాజమండ్రికి చెందిన యం డి ఇఫ్రాన్ లతో ఒప్పందం కుదుర్చుకొని గత నాలుగు నెలలుగా ఆప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. 

నిందితుడితో పాటు మరో 8మంది ఈ అక్రమ దందాలో కొనసాగుతున్నారని వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.నిందితుడిని రిమాండ్ కు తరలిస్తామని అన్నారు..

ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు సూచనలతో అక్రమ కల్తీ వ్యాపార దందాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై లక్ష్మీకాంతం మరియు సిబ్బంది ని డిఎస్పి శ్రీహరి రాజు అభినందించారు.

ప్రజలు నకిలీ పదార్థాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.అక్రమ వ్యాపారాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.. #Dadala babji

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
  అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న...
By Pagadala Venkateswar 2026-04-10 12:21:59 0 136
Andhra Pradesh
TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు....
By Pagadala Venkateswar 2026-01-31 10:39:59 0 521
Telangana
హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|
      సికింద్రాబాద్  : గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు...
By Sidhu Maroju 2025-12-05 13:31:32 0 334
Telangana
కురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..*
*రాజునాయక్ పశువుల వ్యాపారం చేయడం తప్పా, సంతలో బ్రోకర్ (మధ్యవర్తిత్వం) చేయడం తప్పా...!!* ...
By CM_ Krishna 2025-12-16 01:18:24 0 331
Andhra Pradesh
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్టు...
  పొన్నూరు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్ చింతలపూడి గ్రామంలో పొన్నూరు...
By Gadiyapudi Narendra 2026-02-24 17:18:35 0 556
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com