Chandrababu Naidu: పాలనలో టెక్నాలజీ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు.

0
214

డేటా ఆధారిత పాలనే లక్ష్యం.. ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష

2026ను 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్'గా మార్చాలని పిలుపు

ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ వినియోగం పెంచాలని సీఎం ఆదేశం

'మన మిత్ర' ద్వారా ఇప్పటివరకు 1.43 కోట్ల మందికి సేవలు

పాలనలో సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించి, క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. డేటా ఆధారిత పాలనపై మరింత దృష్టి సారిస్తామని, 2026వ సంవత్సరాన్ని 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్'గా మార్చాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సామర్థ్యం లేని ఉద్యోగులకు సరైన శిక్షణ ఇచ్చి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాలనలో ఎదురయ్యే అనేక సమస్యలను టెక్నాలజీతో సులభంగా పరిష్కరించవచ్చని అన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను (గ్రీవెన్సులు) ఏఐ ద్వారా వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

 

'మన మిత్ర' - వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై కూడా సీఎం సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ:సదుం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారంను...
By Kothuru Murali 2026-02-07 07:10:57 0 213
Andhra Pradesh
సీఎంకి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు...
By Boiena Rajesh 2026-02-28 11:17:06 0 229
Andhra Pradesh
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు...
By Pagadala Venkateswar 2026-04-18 04:09:22 0 150
Andhra Pradesh
మదనపల్లి పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: చైర్‌పర్సన్.
గురువారం మదనపల్లెలోని పికెయంయుడిఎ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది....
By Pagadala Venkateswar 2026-05-08 05:21:52 0 133
Telangana
హైదరాబాద్‌లో కురిసిన వర్షం నగర వాతావరణాన్ని మారుస్తూ చల్లని గాలులను తెచ్చింది.
హైదరాబాద్‌-నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్, రంగారెడ్డి,...
By Bharat Aawaz 2025-08-12 06:20:09 0 754
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com