జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|

0
241

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో అంబరాన్నంటాయి. మచ్చ బొల్లారం (డివిజన్ 133) కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని  మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. 

" రెపరెపలాడిన జాతీయ పతాకం "

 అల్వాల్ లోని రాజీవ్ గాంధీ సర్కిల్, ఎంజీ నగర్, సప్తగిరి ఎంక్లేవ్, గోపాల్ నగర్ సర్కిల్, జిఎంఆర్ కాలనీ వంటి పలు ప్రాంతాల్లో నిర్వహించిన  పథకావిష్కరణ కార్యక్రమాల్లో మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాఫలాలను ప్రతి పేదవాడికి అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన రాకతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం మేలుకొంది. 

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, సిఎల్ యాదగిరి, సురేష్, ఉదయ్ కుమార్, భాస్కర్,  బలవంత్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, సూర్య కిరణ్, రాజనర్సింహారెడ్డి, కృష్ణ గౌడ్, సంజీవ, తదితరులు పాల్గొన్నారు.

" కార్యకర్తల కోలాహలం :"

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళా విభాగం, ఎన్ ఎస్ యు ఐ  (NSUI) ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై హింద్, మైనంపల్లి హనుమంతరావు నాయకత్వం వర్ధిల్లాలి, అన్న నినాదాలతో అల్వాల్ ప్రాంతం మారు మోగింది.

#sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
Shri Binod Kumar, IPS: A Leader Shaping Modern Police Excellence
A 1997-batch AGMUT cadre IPS officer whose commitment to professional policing, organizational...
By Kalaga Sailaja 2026-07-23 10:40:51 0 133
SURAKSHA
Dr. A. Kaushigan, IAS: Driving Excellence in Public Governance
The Journey Begins "The true purpose of public administration is to ensure that every policy...
By Fathima Safa 2026-07-15 09:00:16 0 181
Andhra Pradesh
అర్హత కలిగిన పేద విద్యార్థుల విద్య
శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు...
By Manda Ramkumar 2026-03-27 04:45:43 0 224
Telangana
క్యూ పాటించమన్నందుకు ఇంత కక్షా? అల్వాల్‌లో కలకలం!
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపుకునే క్రమంలో తలెత్తిన వివాదం...
By Sidhu Maroju 2026-04-07 08:05:09 0 265
Andhra Pradesh
ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-06-25 05:47:35 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com