Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

0
229

దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 77వ గణతంత్రదిన వేడుకలు

ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలన్న చంద్రబాబు 

గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న నారా లోకేశ్

దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

 

చంద్రబాబు సందేశం

 

‘సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభదినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనల్ని మనమే పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజును ఘనంగా జరుపుకుందాం. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాదులు వేసింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి’ అంటూ సీఎం చంద్రబాబు సందేశం ఇచ్చారు.

 

నారా లోకేశ్ సందేశం

 

‘77వ గణతంత్ర దినోత్సవ శుభవేళ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మువ్వన్నెల జాతీయ పతాక రెపరెపలు మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు ప్రతీక. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు 

Search
Categories
Read More
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-01-02 09:44:43 0 266
Telangana
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల...
By Pinnehasan Odela 2026-01-14 18:42:55 0 266
Andhra Pradesh
గిద్దలూరు పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన
గిద్దలూరు పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ...
By Chennaiah Kati 2026-07-05 10:49:21 0 103
Telangana
మంచిర్యాల నియోజకవర్గంలో 1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం...
By Avunoori Mahesh 2026-09-05 10:38:57 0 151
Telangana
డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్.|
● రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల డ్రగ్ స్వాధీనం ● ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా ముఠా అరెస్ట్...
By Sidhu Maroju 2026-09-02 11:41:25 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com