స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

0
388

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు పాఠశాల సమయంలో రీల్స్ చేయడంతో పలుమార్లు ఉన్నతా ధికారులు హెచ్చరించారు. అయినా ఆ ఉపాధ్యాయురాలు తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. ఖమ్మం మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమి కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ.. తన ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తోంది. అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయం వృథా చేస్తోందనే అంశాలపై గతంలో పలు మార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం ఆమెను సస్పెండ్ చేశామని డీఈవో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాడు అందించాలని, విధినిర్వ హణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే డీఈవో కార్యాలయంలో మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు సమయం పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్ పై ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతుండ టంతో మెమో జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. కార్యాలయ సిబ్బంది కార్యాలయ సమయపాలన పాటించాలని, అంకితభావంతో పని చేసి ఫైల్స్ అందించాలని డీఈవో సిబ్బందికి సూచించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు.*

Search
Categories
Read More
Telangana
జిహెచ్ఎంసి లో కాలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
By Ponnala Srinivasrao 2026-07-12 06:10:44 0 201
Andhra Pradesh
తల్లి కష్టానికి ప్రతిఫలం.. కోర్టులో కుమారుడికి జాబ్
 రాజాం పట్టణంలోని ఎల్లయ్య నగర్కు చెందిన అరసాడ యువరాజు శ్రీకాకుళం జిల్లా కోర్టులో టైపిస్ట్...
By Boiena Rajesh 2026-08-22 05:28:17 0 89
Andhra Pradesh
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం పల్లె కృష్ణ CTIU తాడేపల్లి మండలం కన్వీనర్
కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం.    పల్లె కృష్ణ, సిఐటియు తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-20 13:49:07 0 246
Telangana
గంజాయి నీయంత్రణ మాదక ద్రవ్యల నిర్ములనకై తనిఖీలు : Si ప్రశాంత్
మంచిర్యాల : గంజాయి,మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్...
By Avunoori Mahesh 2026-05-21 11:36:16 0 184
SURAKSHA
"Kevithuto Sophie, IPS: Leading Nagaland's Armed Police Force"
A seasoned 2011-batch IPS officer of the Nagaland Cadre, Kevithuto Sophie has risen from the...
By Lokeshwari Panthadi 2026-07-28 09:06:17 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com