స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల!!

0
523

కర్నూలు : డోన్ : 

డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల సమర్థ నిర్వహణకు కీలకమైన చర్య ప్రారంభమైంది. ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన నూతన “స్వచ్ఛ రథం” వాహనాన్ని డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ “తుక్కు ఇవ్వండి… సరకులు తీసుకోండి” అనే నినాదంతో ఈ స్వచ్ఛ రథం ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుంది. ప్రజలు తమ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను అందిస్తే, వాటి బదులుగా నిత్యావసర సరుకులను రథం సిబ్బంది అందజేస్తారు. సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్‌కు పంపడం ద్వారా పర్యావరణ సంరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడనుంది అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాలను తగ్గించాలంటే ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజల చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థాల సరైన నిర్వహణ తప్పనిసరిగా అమలు చేయాలని ఎమ్మెల్యే గారు తెలిపారు .

ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో శుభ్రత మరింత మెరుగుపడటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా గణనీయమైన తోడ్పాటు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Love
1
Search
Categories
Read More
SURAKSHA
Sanjeev Kumar Jain: A Beacon of Human Rights
Upholding Justice: The Integrity of a Dedicated Officer JOURNEY ; In the complex landscape of...
By Kalaga Sailaja 2026-07-17 05:59:08 0 31
Andhra Pradesh
అక్రమ కేసులు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి...
By Pagadala Venkateswar 2026-05-26 05:57:50 0 113
Telangana
కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక...
By Thalakokkula Sadanandam 2026-03-11 18:09:41 1 3K
Telangana
చివరి దశకు చేరుకున్న బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు
బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా సాగుతున్నా, 2026 మార్చి పూర్తి చేయడానికి అధికారులు...
By Ponnala Srinivasrao 2026-03-24 09:43:20 0 175
SURAKSHA
Modernizing Justice: The DNHDD Police & RRU TREE Partnership
n a visionary move to redefine law enforcement standards, the Dadra & Nagar Haveli and Daman...
By Lokeshwari Panthadi 2026-07-03 09:17:21 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com