అనంతపురం: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

0
634

ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యం... జిల్లా అంతటా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు

 జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా... అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు మరియు మండల కేంద్రాలలో అర్ధరాత్రి వరకు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు సమన్వయంతో పాల్గొని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనదారులను తనిఖీ చేశారు. బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు.

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. దీనివల్ల వాహనదారుడితో పాటు సాటి ప్రయాణీకుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో...ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఇటువంటి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేపట్టాలని... పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
మదనపల్లిలోని బాలికల వసతి గృహంలో ఆదివారం 'హ్యాపీ సండే' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...
By Pagadala Venkateswar 2026-02-22 10:55:44 0 161
SURAKSHA
Sanjay Kumar Shukla, IAS: Champion of Inclusive Governance
The Journey begins "An administrator's greatest achievement is improving the lives of ordinary...
By Fathima Safa 2026-07-20 13:05:00 0 92
Andhra Pradesh
పుంగనూరు: పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
బుధవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వైభవంగా జరిగింది. పేదల సంక్షేమమే...
By Kothuru Murali 2026-05-27 15:05:35 0 110
Telangana
ఇంద్రనగర్ లేబర్ అడ్డా - శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు .|
మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా   వెంకటాపురం డివిజన్ ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద...
By Sidhu Maroju 2026-02-19 10:04:22 0 276
Telangana
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ విజయవంతం అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ, BLO వనితకు ఘన సన్మానం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి  జగదీష్,: బాబాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు...
By Chunarkar Jagadeesh 2026-07-30 11:37:58 0 414
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com