జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, శక్తి బృందాలు సంయుక్తంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు...
Posted 2026-01-22 12:53:19
0
469
చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, శక్తి బృందాలు సంయుక్తంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు మరియు వివిధ ప్రాంతాలలోని మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి,శక్తి యాప్ ఉపయోగాల గురించి, మహిళా సంబంధిత చట్టాల గురించి సైబర్ నేరాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించే వారి నుండి రక్షణ కల్పించాలంటే ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనే దాని గురించి బాలికలకు అవగాహన కలిగి ఉండాలన్నారు.
విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో డెమో ప్రదర్శించి సరైన మరియు అసహజ స్పర్శల మధ్య తేడాను వివరించారు.
ఎవరైనా అపరిచిత వ్యక్తులు బ్యాడ్ టచ్ చేయటానికి ప్రయత్నిస్తే వెంటనే ఉపాధ్యాయులకు గాని, తల్లిదండ్రులకు గాని, పోలీస్ వారికి గాని తెలియజేస్తే వారికి వెంటనే సాయం అందుతుందన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తక్షణ సహాయం పొందే సాధనంగా "శక్తి యాప్" ఉపయోగపడుతదిఅన్నారు.
శక్తి యాప్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చెయ్యాలి అనే విషయాలను వివరించడమే కాకుండా శక్తి యాప్ ను ఎలా పని చేస్తుందో అందరికీ అర్థమయ్యే విధంగా SOS
విధానాన్ని పోలీస్ అధికారులు వివరించారు.
మాదకద్రవ్యాలకు విద్యార్థులు, యువత బానిసలై తమ జీవితాలను పాడుచేసుకోకూడదని హెచ్చరించారు.
సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, డిజిటల్ అరెస్ట్ పలు ఇతర రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.
గోల్డెన్ అవర్ లో సమాచారాన్ని అందిస్తే బాధితుల డబ్బు సురక్షితంగా తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
ప్రజల భద్రత, యువత భవిష్యత్తు రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కరీంనగర్ : తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు...!
కరీంనగర్ పట్టణం ముకురాంపురం ఆరెల్లి మల్లేష్ అనే వ్యక్తి తన తండ్రి ఆరెల్లి నరసయ్య గొడ్డలితో నరికి...
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు
ప్రోగ్రెసివ్ ప్యానల్ మద్దతు తో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు ఏకగ్రీవంగా...
మదనపల్లెలో చిల్లర దొంగల హల్‌చల్.
మదనపల్లె మండలంలోని సీటీఎం ప్రాంతంలో చిల్లర దొంగల బెడద పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి ఇద్దరు...
వసతి గృహా విద్యార్థులకు కొరకు పుస్తకాలు, సామాగ్రి అందించిన కలెక్టర్
గుంటూరు జనవరి 3: సంవత్సర సందర్భంగా పూల బొకేల సంస్కృతికి స్వస్తి పలికి, ప్రభుత్వ వసతి గృహాల...
రాజకీయాల్లో జగన్ ఓ జోకర్ టిడిపి రాష్ట్ర నాయకులుమాదగాని గురునాథం
ప్రచురుణార్థం (10.04.26)
...