తూంపల్లిలో గ్రామంలో ఎస్.ఐ.ఆర్ ఓటర్ల సర్వే ఫామ్స్ పంపిణీ

0
275

🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండల పరిధిలోని తూంపల్లి గ్రామ పంచాయతీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే (SIR) ప్రక్రియ క్షేత్రస్థాయిలో వేగవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా, నేడు తూంపల్లి గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ టేకం ఈశ్వరి గారి ఆధ్వర్యంలో ఎస్.ఐ.ఆర్ (S.I.R) సర్వే ఫామ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకోవడానికి, కొత్త ఓటర్ల నమోదు మరియు తప్పుల సరిదిద్దడానికి జూలై 24 వరకు జరిగే ఈ ఇంటింటి సర్వే అత్యంత కీలకమని, గ్రామస్థులందరూ సర్వే సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని చంద్రయ్య గారు, మాజీ సర్పంచ్ టేకం బాబురావు గారు, ఫీల్డ్ ఆఫీసర్ కేశవరావు గారు, డీలర్ రేఖల సుదర్శన్ గారు, నాగుబాయ్ గారు, కారోబార్ సాబీర్ గారు మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు గాయాలు.
మదనపల్లె మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూలవాండ్లపల్లికి చెందిన రైతు రమణప్ప (60)...
By Pagadala Venkateswar 2026-06-14 06:17:04 0 104
Mizoram
Mizoram Boosts Border Trade and Regional Connectivity
Mizoram is strengthening its position as a strategic gateway to Southeast Asia through enhanced...
By Fathima Safa 2026-06-25 04:20:05 0 125
Telangana
నిజామాబాద్: రైల్వే డికోని వ్యక్తి ధూర్మమరణం
నిజామాబాద్ .జంకంపేట్ మధ్యగాల అర్సపల్లి రైల్వేగెట్ వాధ డెమో రైలు డికోని గుర్తుతేలియాని వ్యక్తి...
By Sadaq Sadaq 2026-04-12 16:22:55 0 154
Andhra Pradesh
రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!
Andhra Chandrababu Naidu Kavali visit schedule నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో...
By Pagadala Venkateswar 2026-05-19 05:38:13 0 118
Andhra Pradesh
ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు.
  ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు...
By Pagadala Venkateswar 2026-06-10 06:03:03 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com