Pawan Kalyan: పార్టీ నేతలకు కీలక సూచన చేసిన పవన్ కల్యాణ్.

0
192

Pawan Kalyan Issues Key Directives to Party Leaders

ఇతర వ్యక్తుల మధ్య జరిగే వాటిని జనసేనకు ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న పవన్

వివాహేతర సంబంధాలను కూడా జనసేనపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్య

దుష్ప్రచాలను పార్టీ శ్రేణులు ఖండించాలని సూచన

జనసేన పార్టీపై ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు కాపు కాస్తున్నారని... పార్టీ పట్ల వారికున్న నిబద్ధత చాలా గొప్పదని ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. సంస్థాగత అంశాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

 

 

 

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేన పార్టీకి ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 

 

ప్రత్యేకంగా వివాహేతర సంబంధాలు వంటి వ్యక్తిగత అంశాలను కూడా జనసేనపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని పవన్ పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ విధమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాలని సూచించారు

Search
Categories
Read More
Andhra Pradesh
వేసవి రాకముందే నీటి ఎద్దడి..
బొబ్బిలి పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేగావతి నదిలో నీటి మట్టం తగ్గడంతో...
By Boiena Rajesh 2026-03-04 10:48:38 0 211
Telangana
నేలకొండపల్లి లో కొనసాగుతున పోలింగ్...!
మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కాగా పళ్ళు కేంద్రాలు వద్ద ఉదయం 7: 00...
By Krishna Balina 2025-12-14 05:46:43 1 524
Andhra Pradesh
ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసాగిల్
AP హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్   AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్ను...
By Rajini Kumari 2026-02-27 11:17:17 0 171
Telangana
Huge Re-Shuffle in Telangana IAS
By Bharat Aawaz 2025-06-12 17:03:35 0 3K
SURAKSHA
Odisha Police Plant Trees For Green Odisha Mission
 As part of environmental protection, Odisha Police today led a massive tree plantation...
By Kalaga Sailaja 2026-07-06 07:26:14 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com