మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.

0
264

ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మన గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంగళగిరిలోని అంజుమన్ ఆస్తుల పరిరక్షణపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా షేక్ నూరి ఫాతిమా గారు మాట్లాడుతూ.. మంగళగిరిలోని అంజుమన్ కమిటీకి చెందిన 71 ఎకరాల వక్ఫ్ భూమిని ఐటీ పార్క్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వక్ఫ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని లాక్కోవాలని చూడటం మైనారిటీల పట్ల కూటమి ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని ఆమె విమర్శించారు.

దీనికి నిరసనగా ఈనెల 30వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం నమాజ్ అనంతరం, నగరంపాలెం ఈద్గా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తామని ఆమె ప్రకటించారు.

సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ షైదా ఖాన్ గారు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ గారు, తూర్పు నియోజకవర్గ మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ లియాఖత్ గారు, జిల్లా యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ సూరజ్ గారు, జిల్లా కార్మిక శాఖ సెక్రెటరీ షౌకత్ అలీ బేగ్ గారు, నగర యూత్ వింగ్ సెక్రటరీ షేక్ ఉమర్ ఫారూక్ గారు, తూర్పు నియోజకవర్గ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సుభాని గారు, నగర యూత్ వైస్ ప్రెసిడెంట్ షేక్ రబ్బానీ గారు, ఐటీ వింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీమ్ గారు, మైనారిటీ డివిజన్ అధ్యక్షులు సలీం గారు, నజీర్ గారితో పాటు డివిజన్ మైనారిటీ అధ్యక్షులు జబి, బషీర్, షైదా, సమాద్, కుతుబుద్దీన్, యూసుఫ్, రియాజ్, సుభాని, ఖాజా గారు మరియు షేక్ భికారి గారు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం...
By Boya Dasthagiri 2026-07-13 10:17:03 0 129
Lakshdweep
Skies Over the Sea: Seaplane Trials a Success
The horizon of Lakshadweep witnessed a historic transformation this week as seaplane trials...
By Dunna Jessicaruth 2026-05-14 10:28:44 0 125
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్కును సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
*Avja ఎన్టీఆర్ జిల్లా మూలపాడు*    *ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం లోని సీతాకోక...
By Rajini Kumari 2026-05-29 11:23:47 0 101
SURAKSHA
Karnataka Police: Blood Donors Saving Lives Today
Today Karnataka police officers led “Raktha Dana Jeevana Dana” blood donation camps...
By Kalaga Sailaja 2026-07-04 06:29:46 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com