జనం కష్టమే తన కష్టంగా మురుగు సమస్యపై కార్పోరేటర్ మెరుపు తనిఖీ.|

0
235

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  "ప్రజా క్షేమమే మా ప్రథమ లక్ష్యం " అని నినాదంతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు.

 జగన్మాత ఆలయం, ఓల్డ్ గాబ్రియేట్ స్కూల్, మరియు వెంకట్రావుపేట పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థతో  స్థానికులు పడుతున్న ఇబ్బందులపై ఆమె యుద్ధ ప్రాతిపదికపై స్పందించారు.  కేవలం కార్యాలయానికి పరిమితం కాకుండా HMWSSB ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో  పర్యటించారు. మురుగునీరు పొంగిపొర్లుతున్న ప్రాంతాలను అంగుళం అంగుళం పరిశీలించి అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు. తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా సమస్యలు మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికార సిబ్బందిని ఆదేశించారు. 

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మురుగునీరు నిలిచిపోవడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. పారిశుద్ధ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని  స్పష్టం చేశారు.

అధికారుల వెంట శేఖర్, అరుణ, ప్రేమ్, సెంథిల్ వంటి పలువురు నాయకులు, మరియు కార్యకర్తలు, ఈ పర్యటనలో పాల్గొన్నారు.

తక్షణమే పనులు ప్రారంభం కావడంపై స్థానిక నివాసతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#sidhumaroju

 

 

 

Search
Categories
Read More
Telangana
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల..!
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు  బోర్డ్ వెల్లడించింది....
By Sunka Santhosh 2026-04-11 18:15:33 0 254
Telangana
టామ్కామ్ను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 20: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-05-20 07:04:55 0 198
Telangana
ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి..
ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి.. ఈ దృశ్యం నన్ను కలచి వేసింది.. ఏ...
By Ponnala Srinivasrao 2026-05-25 02:45:14 0 141
Andhra Pradesh
పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన...
By Boiena Rajesh 2026-05-17 01:00:32 0 240
SURAKSHA
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's Progress
An Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu...
By Lokeshwari Panthadi 2026-07-17 08:18:31 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com