ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.

0
196

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది

ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్

వారి పోస్ట్‌పై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రా వంటకాలు తమ ఆప్యాయతను చాటుతాయన్న ముఖ్యమంత్రి

జపాన్ ప్రజలను ఏపీకి రెండో ఇల్లుగా భావించి రావాలని ఆహ్వానం

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా భోజనాన్ని ఆస్వాదించారు. సంప్రదాయ వంటకాల రుచిపై వారు ప్రశంసలు కురిపించగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందిస్తూ వారిని రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.

 

జపాన్ దౌత్యవేత్తల బృందం మంగళవారం ఏపీ భవన్‌లో టీమ్ లంచ్‌లో పాల్గొని, సంప్రదాయ ఆంధ్రా థాలీని రుచి చూసింది. ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. "మేము ఘాటైన రుచులతో కూడిన అద్భుతమైన, నిజమైన ఆంధ్రా థాలీని ఆస్వాదించాం. ధన్యవాదాలు!" అని పేర్కొంది.

 

ఈ పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. "మా సంప్రదాయ ఆహారాన్ని మీరు ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది. జపాన్ వంటకాలైన సుషీ, సషిమి ఎలాగైతే ఆ దేశ సంస్కృతిలో కచ్చితత్వం, సమతుల్యతను ప్రతిబింబిస్తాయో, అలాగే ఆంధ్రా వంటకాలు తమ రుచుల ద్వారా ఆప్యాయతను, ఉదారతను చాటుతాయి" అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

అంతేకాకుండా, "మీ కోసం, జపాన్ నుంచి మా రాష్ట్రానికి వచ్చే అతిథుల కోసం ఇంకా ఎన్నో రుచులు వేచి ఉన్నాయి. మీ అందరికీ రెండో ఇల్లయిన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం పలకడానికి మేం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
రికార్డు స్థాయిలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం హుండీ ఆదాయం
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో 54 రోజుల హుండీ ఆదాయం రూ. 1, 25, 45, 420 వచ్చింది. హుండీలో 43. 950...
By Kothuru Murali 2026-07-14 12:40:59 0 228
Telangana
నిజామాబాద్: మార్కెట్ యార్డ్‌కు కారెంట్ కాట్
వ్యావసాయా మార్కెట్ యార్డ్‌కు విద్యోత్ సరాఫరాలాను నిలిపివేషారు. 6నెలాలుగా సుమరు రూ. 16 లక్షల...
By Sadaq Sadaq 2026-05-03 10:43:35 0 171
Nagaland
Tribes Resume Sit-In Protest Over 48-Year-Old Reservation Policy
The Nagaland Cabinet has approved the Nagaland Youth Policy 2025, aiming to empower the...
By Bharat Aawaz 2025-07-17 11:06:31 0 1K
Telangana
మనూర్ :- శ్రీ సీత రాములా కళ్యాణం
మనూర్ మండలంలో లోని బెల్లాపూర్ గ్రామంలో స్థానిక సంజీవని హనుమాన్ మందిర్ వద్ద సీత రాములా కళ్యాణం...
By Gandla Vaijanath 2026-03-27 08:43:44 0 498
Telangana
ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవం....MLA శ్రీ దొంతి మాధవ రెడ్డి గారు...
*దుగ్గొండి మండలంలో కొనసాగుతున్న గృహప్రవేశాల పరంపర* భారత్ అవాజ్ న్యూస్: 18జూన్ నేడు వరంగల్...
By Gujile Ramu 2026-06-18 06:20:59 0 301
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com