మహిళా కానిస్టేబుల్ జయ శాంతి స్ఫూర్తిగాద హోం మినిస్టర్ అనిత

0
209

కర్తవ్యం జయశాంతి!

 

కన్నప్రేమnu kartavyaanni samanvayam chEsina మహిళా కానిస్టేబుల్ జయశాంతి స్ఫూర్తిగాథ!

 

ఖాకీ దుస్తులు ధరించినప్పుడు మాత్రమే కాదు, సాధారణ పౌరురాలిగా ఉన్నప్పుడు కూడా బాధ్యతను మర్చిపోని ఒక మహిళా కానిస్టేబుల్ కథ ఇది. కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయి వేలాది మంది ఇబ్బందులు పడుతున్న వేళ, ఒక తల్లి తన బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ నియంత్రించిన తీరు యావత్ రాష్ట్రాన్ని కదిలించింది.

 

శనివారం సాయంత్రం కెనాల్ రోడ్డులో ఒక లారీ మొరాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో లేకపోయినా, తన రెండున్నరేళ్ల కుమారుడిని ఎత్తుకుని ఉన్నప్పటికీ, జయశాంతి వెనకడుగు వేయలేదు. ఒకవైపు కన్నప్రేమ, మరోవైపు ప్రజాసేవ.. ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ ఆమె గంటల తరబడి ట్రాఫిక్ ను చక్కదిద్దిన దృశ్యం పోలీసు వ్యవస్థకే గర్వకారణం.

 

ఈ అద్భుతమైన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత స్వయంగా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సంభాషణలో జయశాంతి మాటలు ఎంతో వినయంగా, గర్వంగా ఉన్నాయి. తన భర్త కూడా ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ అని, తమది పోలీసుల కుటుంబమని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు.

 

మంత్రి అనిత మాటల్లో.. "జయశాంతి లాంటి పోలీసులు ఉన్నందుకే నేడు పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. మీ సేవలు వెలకట్టలేనివి" అంటూ మంత్రి అనిత ఆమెను ప్రశంసించారు. అంతేకాకుండా, జయశాంతి తనను కలవాలని కోరగా, వెంటనే సానుకూలంగా స్పందిస్తూ విజయవాడలో కలుద్దామని హామీ ఇచ్చారు.

 

యూనిఫామ్ లేకపోయినా, చంకలో చిన్న బిడ్డ ఉన్నా.. బాధ్యతను గుర్తెరిగి స్పందించిన జయశాంతి ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఒక తల్లిగా, ఒక రక్షక భటురాలిగా ఆమె చూపిన తెగువకు సెల్యూట్!

Search
Categories
Read More
Jammu & Kashmir
Border Vigil Tightened: White Knight Corps Reviews Security in Poonch-Rajouri
Following the discovery of a militant hideout and the recovery of IED batteries in Rajouri, the...
By Dunna Jessicaruth 2026-05-14 07:49:14 0 110
Andhra Pradesh
కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో...
By Ratna Sekhar 2026-02-28 18:16:40 0 2K
Andhra Pradesh
Madanapalle: ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
మదనపల్లె: జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన...
By Pagadala Venkateswar 2026-07-21 09:59:23 0 118
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు నియోజకవర్గం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి...
By Boya Dasthagiri 2026-04-09 08:50:11 0 246
Telangana
ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం లో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల పరస్పర దాడులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ...
By Sidhu Maroju 2025-07-15 13:34:06 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com