ఎన్టీ రామారావు కు ఘనంగా నివాళులు అర్పించిన కోడుమూరు ఎమ్మెల్యే !!

0
189

కర్నూలు : కోడుమూరు :

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మహానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా  కోడుమూరు నియోజకవర్గ ఎంఎల్ఏ శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.*
ఈరోజు విజయవాడ తెలుగుదేశం పార్టీ  కేంద్ర కార్యాలయంలో  కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని, రాజకీయాల్లో విలువలు, ఆత్మగౌరవాన్ని పెంపొందించిన అపూర్వ వ్యక్తిత్వం అని కొనియాడారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంకు ఛైర్మెన్ వెంకట్రాముడు , కర్నూలు పార్లమెంట్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బోగినీ నాగేంద్ర ,టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Haryana
Haryana Cities Review Strategy for Monsoon Readiness
With the monsoon rapidly advancing across northern India, district administrations in Gurugram,...
By Lokeshwari Panthadi 2026-06-27 05:33:27 0 39
SURAKSHA
Telangana Retired Police: Serving People Without Uniform
Retirement తర్వాత Telangana Police officers uniform లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. Slum areas...
By Kalaga Sailaja 2026-07-03 11:26:19 0 26
Andhra Pradesh
గంజాయి మత్తుతోనే అఘాయిత్యాలు: మాజీ ఎమ్మెల్యే.
ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటమే మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి ఋషిక...
By Pagadala Venkateswar 2026-02-19 10:32:42 0 163
Telangana
ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి - పాల్గొన్న ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ...
By Sidhu Maroju 2025-12-01 07:13:55 0 217
Andhra Pradesh
మదనపల్లి లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: కలెక్టర్.
మదనపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని...
By Pagadala Venkateswar 2026-01-29 11:53:36 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com