ప్రాణ రక్షణే లక్ష్యం- అల్వాల్ లో మార్మోగిన "అరైవ్ అండ్ అలైవ్" నినాదం .|

0
281

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన _అరైవ్_అండ్_అలైవ్ (arrive and alive) కార్యక్రమంలో భాగంగా అల్వాల్ పోలీస్ యంత్రాంగం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించింది.

అల్వాల్ లాఅండ్ ఆర్డర్ (L&O) పోలీసు మరియు ట్రాఫిక్ విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా జరిగిన ఈ కార్యక్రమం.. అల్వాల్ పోలీస్ స్టేషన్, జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం,  మరియు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాల్లో జరిగింది. 

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ వైద్యులతో పాటు  అల్వాల్ పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున పాల్గొన్నారు.

నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, వాహనదారులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ మరియు సీటు బెల్టు ధరించడం యొక్క ప్రాముఖ్యతను అధికారులు వివరించారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ (Oath) చేశారు. 

 ఈ సందర్భంగా అల్వాల్ ఎస్ హెచ్ ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, నియమాలను పాటించడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. 

ఈ ప్రచార కార్యక్రమానికి సహకరించిన అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి...
By Pagadala Venkateswar 2026-03-16 10:15:02 0 235
Andhra Pradesh
Andhra Pradesh Government: ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్.
జాతీయ అర్హత పరీక్ష (నీట్), ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను పెంచే...
By Pagadala Venkateswar 2026-03-28 04:33:44 0 578
BMA
Moral Injury: The Hidden Guilt of the Digital Journalist
Digital journalists frequently experience "moral injury" and intense viewer shame. Because they...
By JoinBMA 2026-08-21 17:34:16 0 368
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులు ముఖ్యమంత్రులు చంద్రబాబు
*For scrolls*   *అమరావతి*   *జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Rajini Kumari 2025-12-17 09:03:54 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com