Andhra Pradesh Government: ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్.

0
577

జాతీయ అర్హత పరీక్ష (నీట్), ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే పరీక్షలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

 

ఎన్టీఏ పరీక్షల సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఎన్టీఏకు బలమైన అనుసంధానం ఉండాలని రాధాకృష్ణన్ కమిటీ సూచించింది. దీని ఆధారంగానే కేంద్ర విద్యాశాఖ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసింది.

 

తాజా ఉత్తర్వుల ప్రకారం, పరీక్షా కేంద్రాల్లో అక్రమాలను నివారించేందుకు అభ్యర్థులను తనిఖీ చేసే (ఫ్రిస్కింగ్) బాధ్యతను పూర్తిగా రాష్ట్ర పోలీసులకే అప్పగించారు. ఇప్పటి వరకు కేంద్రాల వద్ద భద్రత, శాంతిభద్రతలకే పరిమితమైన పోలీసులు ఇకపై ఫ్రిస్కింగ్ కూడా నిర్వహిస్తారు.

 

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా రాష్ట్ర స్థాయి కమిటీ పనిచేస్తుంది. ఇందులో ఉన్నత విద్యాశాఖ కమిషనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఏడీజీ (లా అండ్ ఆర్డర్) సహా పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా, జిల్లా కలెక్టర్ ఛైర్‌పర్సన్‌గా జిల్లా స్థాయి కమిటీలు పనిచేస్తాయి. ఈ కమిటీలు నీట్(యూజీ)-2026తో పాటు ఎన్టీఏ నిర్వహించే ఇతర పరీక్షలను సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాయి.

Like
1
Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసులు నేడు: విధి దాటి సమాజ సేవ చేస్తున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విధి గంటలు దాటి ప్రజలకు సేవ చేశారు. విజయవాడ, విశాఖ, రాయలసీమ గ్రామాల్లో...
By Kalaga Sailaja 2026-07-04 08:26:34 0 92
Andhra Pradesh
పుంగనూరు: మసెమ్మకు ప్రత్యేక పూజలు చేసిన పెద్దిరెడ్డి
పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో మసెమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ...
By Kothuru Murali 2026-02-01 09:55:20 0 209
Andhra Pradesh
మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా...
By Vadlamudi NagaVenkat 2026-03-21 05:42:26 0 649
Telangana
తెలంగాణ : 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు..!
జూన్ 2 నుంచి దాదాపు రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కాసరాత్తు...
By Sunka Santhosh 2026-05-21 14:27:58 0 160
Andhra Pradesh
YSR Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో 227 గన్ లైసెన్సులు రద్దు.
ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు లైసెన్స్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు...
By Pagadala Venkateswar 2026-02-01 08:26:59 0 373
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com