తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు

0
280

తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు.

 

✅ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” జరిగింది. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు.

 

✅ ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, తెలంగాణ - ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (TASA) మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారు, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

✅ తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి గారు సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

 

✅ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారన్న విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేస్తూ గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. తెలంగాణలో తక్షణం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు.

 

✅ దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, భారత సైన్యానికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్‌ దామగుండం వద్ద లో-ఫ్రీక్వెన్సీ వీఎల్ఎఫ్ (VLF) నేవీ రాడార్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Hemanta Keshav Patil IAS: Leading Governance with Integrity
A Young Telangana IAS Officer Driving Development Throunsparent Administration and...
By Lokeshwari Panthadi 2026-07-14 09:43:21 0 192
Telangana
సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!
కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన...
By Thalakokkula Sadanandam 2026-05-23 13:56:11 0 436
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 33 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ నితికా పంత్
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను...
By Chunarkar Jagadeesh 2026-08-15 11:18:30 0 182
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రజలకు, అక్కాచెల్లెమ్మలకు వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Madanapalle: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు,...
By Pagadala Venkateswar 2026-08-29 05:38:55 0 78
Andhra Pradesh
తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి.
    తుని బాలిక అదృశ్యం ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా... ఆధారం అనుకున్న పెంపుడు కుక్క మృతి...
By Pagadala Venkateswar 2026-06-14 06:21:45 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com