జర్నలిస్టుల అరెస్ట్... భారీ ఎత్తున.. నిరసన...

0
477

మీడియా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను సిట్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, 

ఈ మేరకు బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేంద్రం నుండి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

 నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమనీ ఆయన మండిపడ్డారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనంపై ఎలాంటి విచారణ జరపకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను అరెస్టు చేయడం వెనుక కుట్ర దాగి ఉంది అన్నారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన 41A నోటీసులను కూడా పోలీసులు విస్మరించారు.బాధ్యత యాజమాన్యానిదే: మీడియాలో వచ్చే కథనాలకు సదరు సంస్థ ఎడిటర్, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మరియు యాజమాన్యం బాధ్యత వహించాలి. కానీ, సంస్థలో పనిచేసే జర్నలిస్టులను, ఉద్యోగులను బాధ్యులను చేస్తూ అరెస్టులు చేయడం పోలీసుల అతి ఉత్సాహానికి నిదర్శనం.

 కుట్రపూరిత చర్యలు: జర్నలిజంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారిని టార్గెట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉంది. ఇది సామాన్య జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే చర్య.

 ముఖ్యమంత్రికి విన్నపం: తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. పోలీసులు మరియు అధికారులు అనుసరిస్తున్న ఏకపక్ష విధానంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. తక్షణ విడుదల: బలహీన వర్గాలకు చెందిన ఈ ముగ్గురు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కులను కాపాడటంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, IPS గారు,.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ...
By Chennaiah Kati 2026-06-24 10:54:08 1 98
Andhra Pradesh
హనుమాన్ జంక్షన్ లో అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు
ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-04-29 07:50:24 0 272
Telangana
'అంబేద్కర్ ఆశయాలకు నేతల కృతజ్ఞత నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-04-14 08:22:22 0 372
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై మార్పులు రావాలి
పత్రికా ప్రకటన    ఇంద్రకీలాద్రి, 06 జనవరి 2026   సెక్యూరిటీ సిబ్బంది పనితీరులో...
By Rajini Kumari 2026-01-06 11:01:57 0 256
PRAGATI
🚀 BUSINESS EDGE: Transforming Media Aspirants into Entrepreneurs
🚀 BUSINESS EDGE: Transforming Future Media Leaders into Entrepreneurs Zero Investment. High...
By PRAGATI 2025-04-30 04:55:42 0 4K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com