విజయ డైరీ మరింత అభివృద్ధి చెందాలి సుజనా చౌదరి

0
233

విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి.. డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా..                  

 

 

పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బుధవారం ఉదయం చిట్టినగర్ లోని విజయ పాల డైరీ ను సందర్శించారు..l

మిల్క్ ప్రాజెక్ట్ లో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి పాల్గొన్నారు. అక్కడ గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం కురియన్, కాకాని వెంకటరత్నం, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ డైరీ యాజమాన్యంతో కలిసి ప్లాంటును సందర్శించారు. పాల ద్వారా పాల ప్యాకెట్లను తయారు చేసే విధానంతో పాటు, పాల ఉత్పత్తులు తయారు చేసే ప్లాంటును ఆయన క్షున్నంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా విజయ డైరీలో గోమాతకు పూజలు నిర్వహించామని చెప్పారు. అనంతరం ప్లాంటుని కూడా సందర్శించినట్లు తెలిపారు. 

ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించే విషయంలో నాణ్యత ప్రమాణాలు బాగున్నాయని, అయితే ప్లాంటు ను మరింత ఆధునీకరించాలని ఆయన యాజమాన్యానిక్కి సూచించారు.. 

అనంతరం విజయ డైరీ చైర్మన్ జలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతుల కుటుంబాలతో నడుపుతున్న విజయ డైరీ తరపున ఆయన రాష్ట్ర ప్రజలకు నగర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి తమ ప్లాంట్ ను సందర్శించారని పలు సూచనలు కూడా అందించారని వాటిని తాము అమలు పరుస్తామని తెలిపారు.... కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, రెడ్డిపల్లి రాజు, మరియు డైరీ సిబ్బంది పాల్గొన్నారు..

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Boosts Employment and Enterprise
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening employment opportunities and...
By Fathima Safa 2026-07-02 07:57:12 0 193
SURAKSHA
Brijendra Kumar Yadav, IPS: Championing Smart Policing
A Dedicated IPS Officer Strengthening Cyber Security, Crime Investigation, and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-17 07:06:11 0 272
Telangana
సింగరేణి కార్మికుల సమస్యలను కేవలం హామీలతోనే సర్దిపెట్టుకుంటూ వస్తున్న యూనియన్లు, యాజమాన్యం, ప్రభుత్వం — కానీ అమలు మాత్రం ఎక్కడ?
మంచిర్యాల జిల్లా :ఏళ్ల తరబడి కార్మికులకు ఇచ్చిన హామీలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతన...
By Avunoori Mahesh 2026-05-15 02:30:58 0 210
Andhra Pradesh
శ్రీకాకుళం: ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడల పోటీలు
శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల...
By Manda Ramkumar 2026-03-28 09:27:22 0 523
Andhra Pradesh
వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రమాదానికి ఆహ్వానం.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి రహదారి వద్ద చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజల...
By Pagadala Venkateswar 2026-04-27 06:04:27 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com