అంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు

0
226

తెలుగు సంప్ర‌దాయాల‌ను కొన‌సాగించాలి..

ముగ్గుల పోటీల బ‌హుమ‌తి ప్ర‌ధానంలో ఎమ్మ‌ల్యే సుజ‌నా చౌద‌రి..

 

విజ‌య‌వాడ న‌గ‌ర జ‌న‌సేన నేత బాడిత శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేత‌ల‌కు ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి బ‌హుమ‌తులు అంద‌చేశారు. సంక్రాంతి సంబ‌రాల్లో భాగంగా భ‌వానీపురం పున్న‌మి ఘాట్ లో మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. మ‌హిళ‌లు ఈ పోటీల్లో పాల్గొని వివిధ రకాల వైవిధ్య‌మైన ముగ్గులు వేశారు. పోటీల‌లో విజేత‌ల‌కు ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి బ‌హుమ‌తి ప్ర‌ధానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మ‌ల్యే సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ ఈ సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల‌దరికీ భగవంతుడి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ముగ్గుల కార్యక్రమం మన తెలుగు ప్ర‌జల సంప్రదాయం కాబ‌ట్టి నేటి త‌రం వారికి మ‌న సంస్క్ర‌తి , సంప్ర‌దాయాలు తెలియ‌చేయాల్సిన ఆవ‌స్య‌క‌త ఉంద‌నన్నారు. . భార‌త‌ దేశంలో వివిధ ప్రాంతాలో పేర్లు మారినా పెద్ద పండుగ మాత్రం సంక్రాతి యేన‌న్నారు. పంట‌లు చేతికొచ్చి రైత‌లు ప‌ల్లెల్లో పండుగ‌ ఉత్సాహంతో చేసుకుంటారు .. అదే విధంగా న‌గ‌రాల్లో సైతం పండుగ ను గుర్గు చేసే ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. భావి తరాలకు కూడా పండుగ శోభ తెలియచేయాలంటు ఇటువంటి పోటీలు తోడ్ప‌డ‌తాయ‌న్నారు. పోటీల నిర్వాహ‌కుడు జ‌న‌సేన నేత బాడిత శంక‌ర్ మాట్లాడుతూ తాను గ‌త 40 ఏళ్ల‌లో సుజ‌నా చౌద‌రి వంటి ఉత్త‌మ విలువ‌లు క‌ల్గిన ఎమ్మ‌ల్యేను చూడ‌లేద‌న్నారు. అవినీతి లేకుండా , క‌మిష‌న్లు వ‌సూలు చేయ‌ని ఎమ్మ‌ల్మె గా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల గుండెల్లో చిర స్థాయిలో సుజ‌నా చౌద‌రి నిలుస్తార‌ని కొనియాడారు. కార్య‌క్ర‌మంలో కూట‌మి కార్పొరేట‌ర్లు రాజేష్, అప్పాజీ, జ‌న‌సేన వీర మ‌హిళ‌లు రావి సౌజ‌న్య‌, బీజేపీ నాయ‌కులు అడ్డూరి శ్రీరామ్, స్తానిక నాయ‌కులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఈ బోడెద్దుల విలువ ఎంతో తెలుసా...
పుంగనూరు ఎద్దుల పరుషలో రూ. 5,50,000 విలువైన జోడెద్దులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సత్యసాయి...
By Kothuru Murali 2026-05-07 12:16:19 0 165
Telangana
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలోని ఇటీకాలలో రోడ్డుకు రెడీమిక్స్ కంకర వేయించిన గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామపంచాయతీ...
By Chunarkar Jagadeesh 2026-07-26 15:21:01 0 309
SURAKSHA
సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల ముందడుగు
సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల ముందడుగు: ఏపీ పోలీసులు 'ఏపీ సైబర్ గార్డ్' మరియు 'సైబర్ వార్...
By Kalaga Sailaja 2026-06-26 07:32:57 0 112
Andhra Pradesh
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
By Pagadala Venkateswar 2026-01-25 06:42:50 0 190
Haryana
Haryana Advances Environment and Water Conservation
Haryana continues to strengthen environmental protection and water conservation through...
By Fathima Safa 2026-07-03 05:13:21 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com