ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్

0
220

ప్రచుర్ణార్ధం:

 

"నశీర్ అహమ్మద్ చరిత్ర పుస్తకాలను ఉర్దూలోకి అనువదించి ప్రచురిస్తాం"

- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్

 శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ వెల్లడి. 

---

ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన చరిత్ర గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువదించి ప్రచురిస్తామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ ప్రకటించారు.

విజయవాడలో జరుగుతున్న 36వ పుస్తక ప్రదర్శన మహోత్సవంలో ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ స్టాల్ వద్ద సోమవారం (11- 01-2026) రాత్రి జరిగిన పుస్తకావిష్కరణ సభలో శ్రీ షుబ్లీ మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. 

శ్రీ సయ్యద్ నశీర్ అహ్మద్ రచించిన నూతన గ్రంథం "అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా" ను కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్రోద్యమం లో ముస్లింల పాత్రను వివరిస్తూ సయ్యద్ నశీర్ అహమ్మద్ వెలువరించిన చరిత్ర గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువాదం చేస్తామని, ఆ గ్రంథాలను ముద్రించి మన రాష్ట్రం, మన దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్రంథాలయాలకు అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అకాడమీ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు పార్టీ రాజకీయ కార్యదర్శి శ్రీ టీడీ జనార్ధన్ , సిపిఐ జాతీయ కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ , సిపిఐ (ఏం) జాతీయ పాలిటి బ్యూరో సభ్యులు శ్రీ బివి రాఘవులు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీ గొల్ల నారాయణరావు, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పిల్లి సురేంద్రబాబు తదితర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

===

Search
Categories
Read More
Bharat Aawaz
🛡️ Even a Suspect Has Rights – Bombay High Court Upholds Constitutional Protection
In a landmark move that reinforces the spirit of the Indian Constitution, the Bombay High...
By Citizen Rights Council 2025-07-16 12:46:56 0 2K
Andhra Pradesh
జగన్మోహన్ రెడ్డి మావిగన్ జోకర్ వైయస్ షర్మిల రెడ్డి
BREAKING   విజయవాడ    *జగన్ మోహన్ రెడ్డి “మావిగన్ జోకర్” - వైఎస్...
By Rajini Kumari 2026-04-10 06:36:44 0 169
Andhra Pradesh
ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **
*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం* మార్కాపురం జిల్లా. పెద్ద దోర్నాల. మండల స్థానిక శివసదనంలో శంకర...
By Chennaiah Kati 2026-03-03 13:05:51 0 284
Andhra Pradesh
జూన్ 11న బీఎస్పీ రాయలసీమ జోనల్ సభ.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించనున్న...
By Pagadala Venkateswar 2026-06-08 15:46:35 0 98
Andhra Pradesh
గోవుల అక్రమ రవాణా భగ్నం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను...
By Shyamala Yadagiri 2026-03-18 03:28:05 0 319
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com