అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

0
330

_*నందవరం మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నిర్వహించిన `రైతన్న… మీకోసం` వారోత్సవాలు – డోర్ టు డోర్ కార్యక్రమం | `అన్నదాత సుఖీభవ` కార్యక్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.*_

 

- _*మొదటగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ సంవత్సరానికి రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సహాయం విడుదల చేసిన విషయాన్ని గ్రామ ప్రజలకు వివరించి, రైతులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై అవగాహన కల్పించారు.*_

 

- _*ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ బీవీ మోహన్ రెడ్డి గారి తనయుడు ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి చిన్నకొత్తిలి గ్రామంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. తాను టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.*_

 

- _*అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు గ్రామంలోని పలు ప్రాంతాలను సందర్శించి తాగునీటి సరఫరా, కొత్త రోడ్లు, కాలువలు, పారిశుధ్యం, ప్రజా సమస్యలు మరియు ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.*_

 

_*ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు, మార్కెట్ కమిటీ చైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షుడు, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*_

Search
Categories
Read More
Telangana
Tomorrow banks strike
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న...
By G k Nookala 2026-09-10 16:29:27 0 125
Telangana
నేటి నుండి మూడు రోజులు "దుర్గాష్టమి-మహార్నవమి- విజయదశమి. (దసరా)
హైదరాబాద్: _🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)🚩_ "దుర్గాష్టమి"...
By Sidhu Maroju 2025-09-30 10:55:36 0 320
Telangana
వాహనాల వేలం
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు వివిధ కేసులలో...
By Bheeshman King 2026-01-16 13:32:34 0 546
Meghalaya
Meghalaya Advances Infrastructure and Road Connectivity
Meghalaya is making significant progress in infrastructure development and road connectivity...
By Fathima Safa 2026-06-24 13:20:46 0 116
Telangana
హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ ఉచిత పంపిణీ. బాలికలకు అవగాహన కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో వివిఆర్ గ్రూప్స్ వాగ్మిక...
By Sidhu Maroju 2025-12-07 06:55:57 0 308
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com