సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం

0
138

*For scrolls*

 

*అమరావతి :-*

 

*సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం*

 

*జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై సీఎం సమీక్ష*

 

*ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి సీఎం ప్రసంగం*

• విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం.

• 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రజల ఆశల్ని నిలబెట్టాం. వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించాం

• అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగాం

• ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిస్తున్నాను

• తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు వేశాం

• స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. దీని కోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశాం

• అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశాం

• దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2684 కోట్లు వ్యయం చేశాం

• ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్తమైలు రాయిని సాధించాం. 

• 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశాం

• అమరావతిని స్మశానం అని, ఎడారని ఎగతాళి చేశారు. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు 

• అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం. 

• పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు

• ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. 

• పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం

• నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది

• ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి

• పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది

• తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. 

• రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చు

• పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం

• భోగాపురం ఎయిర్ పోర్టు కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తాం

• విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర సహకారంతో రూ.12 వేల కోట్ల సాయంతో దానిని కాపాడుకున్నాం

• విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ ఆ ప్లాంట్ ను నిలబెట్టి తీరుతాం

• దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయి

• పెట్టుబడులకు డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలు అన్నీ సాకారం అయితే 16 ల క్షల మందికి ఉద్యోగాలు వస్తాయి

• ఎస్ఐపీబీ ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చాం. వీటి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి

• గూగుల్ కూడా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది

• రాష్ట్రానికి పెట్టుబడులు రావటంలో కృషి చేసిన అధికారులు, ప్రభుత్వ విభాగాలను అభినందిస్తున్నాను

• అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేస్తాం. ఆరు నెలల్లో క్వాంటం కంప్యూటర్ ఇక్కడి నుంచి పనిచేస్తుంది

• విద్యుత్ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించగలిగాం. భవిష్యత్తులో రూ.1.19 పైసల మేర యూనిట్ కొనుగోలు ధర తగ్గించటం లక్ష్యంగా పనిచేస్తున్నాం

• ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లలోనూ 970 టీఎంసీలను నింపగలిగాం. రాయలసీమలోనూ పెద్ద ఎత్తున నీటిని నిలిపాం

Search
Categories
Read More
Telangana
ఫోన్ కొట్టేసి... ఖాతా ఖాళి .!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ దొంగలు రెచ్చిపోతున్నారు....
By Sidhu Maroju 2026-03-28 14:01:45 0 130
Andhra Pradesh
లారీ ఢీకొని ఇద్దరు బాలురు మృతి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చీకుల బైలు వద్ద లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-03-21 06:02:57 0 127
Andhra Pradesh
ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి తనిఖీలు చేసిన అధికారులు.
నందవరం మండల కేంద్రంలోని ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఆసుపత్రిలో...
By Boya Dasthagiri 2026-04-16 07:45:57 0 133
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ నాకాబందీ కార్యక్రమం
గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ : 22.12.2025* _*//గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించిన...
By KOTESWARARAO KVSR 2025-12-22 06:04:26 0 209
Andhra Pradesh
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు 02-02-2026...
By Pagadala Venkateswar 2026-02-02 09:56:32 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com