తాడేప‌ల్లి లోని వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా వ‌డ్డె ఓబ‌న్న జ‌యంతి కార్య‌క్ర‌మం.

0
224

తాడేప‌ల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాల‌వాడ నర‌సింహారెడ్డికి సైన్యాధ్య‌క్షుడిగా స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి ఎదురు నిల‌బ‌డి వడ్డే ఓబన్న చూపిన తెగువ‌ను నాయ‌కులు గుర్తుచేసుకున్నారు. తాడేప‌ల్లి లోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు వ‌డ్డె ఓబ‌న్న గారి జ‌యంతి కార్యక్ర‌మాన్ని పార్టీ నాయ‌కులు ఘ‌నంగా నిర్వ‌హించారు. వ‌డ్డే ఓబ‌న్న చిత్ర‌ప‌టానికి నాయ‌కులు పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయ‌న‌తో పాటు వ‌డ్డె రామ‌దాసు వంటి వ‌డ్డెర నాయ‌కుల‌ను ఈ సంద‌ర్భంగా కీర్తించారు. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వ‌డ్డెర సంక్షేమం కోసం మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేసిన కృషిని రాజ‌కీయంగా ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకుని ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఒక‌ ఎమ్మెల్యే సీటుతో పాటు మాచ‌ర్ల‌, చీమ‌కుర్తి, పులివెందుల మున్సిపాలిటీల‌కు చైర్మ‌న్లుగా గుంటూరు జెడ్పీ వైయ‌స్ చైర్ ప‌ర్స‌న్ గా వ‌డ్డెర కుల‌స్తుల‌కు అవ‌కాశం క‌ల్పించిన వైయ‌స్ జ‌గ‌న్ రుణం రాబోయే ఎన్నికల్లో తీర్చుకుంటామ‌ని చెప్పారు. వ‌డ్డెర కుల‌స్తుల‌తో వైయస్ కుటుంబానికి విడ‌దీయ‌రాని బంధం ఉంద‌ని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజ‌కీయంగా వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రోత్స‌హిస్తే.. వైయ‌స్ జ‌గన్ గారు సీఎం అయ్యాక కూడా మరింత ముందుకు తీసుకెళ్లార‌ని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, ఎమ్మెల్సీ, పార్టీ కార్యాల‌య ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు జిల్లా జెడ్పీ వైయ‌స్ చైర్‌ప‌ర్స‌న్ బ‌త్తుల అనూరాధ‌, పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ‌మూర్తి, పార్టీ విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు పానుగంటి చైత‌న్య‌, పార్టీ బీసీ సెల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ బ‌త్తుల రామారావు, చిత్తూరు జిల్లా పార్టీ సోష‌ల్ మీడియా అడ్వైజ‌ర్ ప‌వ‌న్‌, హైకోర్టు అడ్వ‌కేట్ బేబీ రాణి, వివిధ పార్టీ అనుబంధ విభాగాల‌కు చెందిన నాయ‌కులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Dr. Puneet Kumar Goel: Steering Manipur with Vision
A distinguished 1991-batch AGMUT cadre IAS officer whose four decades of administrative...
By Lokeshwari Panthadi 2026-07-22 08:56:10 0 151
Punjab
Global Extortion Rackets Target Punjab Businessmen via U.S. & Malaysian Calls
Punjab authorities are alarmed by a surge in international extortion calls targeting businessmen...
By Bharat Aawaz 2025-07-17 10:58:17 0 1K
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా హోటల్స్ కు గ్యాస్ కొరత నివారించాలి
*ప్రెస్ నోటు* *తేదీ : 13-3-2026,శుక్రవారం* *విజయవాడ, కలెక్టరేట్*   *హోటల్ రంగానికి...
By Rajini Kumari 2026-03-13 13:37:05 0 179
Telangana
Petrol shortage fake news
ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. అధికారిక వర్గాల...
By Kamble Amardeep 2026-03-25 14:45:53 0 517
Chhattisgarh
Chhattisgarh Advances Urban Development and Smart Growth
Chhattisgarh is accelerating urban development through investments in smart infrastructure,...
By Fathima Safa 2026-07-01 09:41:35 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com