ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు

0
223

రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి

 

టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

 

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ (గొల్లపూడి) : 11 జనవరి 2026

 

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్‌ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి సాయుధ పోరాటాన్ని నిర్వహించిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను పురస్కరించుకొని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు. 

 

గొల్లపూడిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం దేవినేని ఉమా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ విశ్వకర్మ, వాల్మీకి, కనకదాస జయంతులను ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. అదే తరహాలో మరో బీసీ ముద్దు బిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని కూడా రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కర్నూలు జిల్లా రేనాటి ప్రాంతంలో 1807 జనవరి 11న సంచార జాతికి చెందిన వడ్డెర కులంలో వడ్డే ఓబన్న జన్మించారని తెలిపారు. శిస్తులు వసూలు విషయంలో బ్రిటీష్‌ ఈస్టు ఇండియా కంపెనీ అధికారులకు, రేనాటి పాలెగాళ్లకు మధ్య ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయని వివరించారు. ఈ ఉద్యమంలో నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం విశేష ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. బ్రిటీష్‌ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొని వడ్డే ఓబన్నకు ఘన నివాళులు అర్పించారు.

Search
Categories
Read More
SURAKSHA
Shaping Governance: The Inspiring Journey of IAS Onkar Sharma
From grassroots administration to leading critical state portfolios, discover how three decades...
By Kalaga Sailaja 2026-07-31 13:05:05 0 289
Rajasthan
Eco Restraint: GRAM 2026 Postponed For Fuel Conservation
In a significant move aligning with Prime Minister Narendra Modi’s public appeal for...
By Dunna Jessicaruth 2026-05-16 08:16:04 0 194
Andhra Pradesh
వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా సావిత్రీ బాయి పూలే జ‌యంతి వేడుకలు.
జ‌యంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది...
By John Baji 2026-01-03 11:32:16 0 261
Business & Finance
Rising Oil Prices Trigger Fuel Hikes and Economic Growth Forecast Cuts
Geopolitical tensions in the Middle East have pushed Brent crude past $105 a barrel, sending...
By Dunna Jessicaruth 2026-05-19 11:12:58 0 293
Telangana
హైదరాబాద్ కా పైచాన్ !పెహల్వాన్ తెలంగాణ కేసరి విజేతలను ఘన సన్మానంచిన : మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 12 : గతంలో హైదరాబాద్ కా పైచాన్ అంటే హైదరాబాద్ కా పెహల్వాన్ అనే పేరు ఉండేది”...
By Avunoori Mahesh 2026-05-12 16:59:27 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com