ఆటలతో ఉద్యోగులలో మానసిక స్థైరం: కమిషనర్

0
226

కర్నూలు : కర్నూలు సిటీ : 

క్రీడలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ప్రారంభం
• ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం పెంపునకు దోహదం

క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తగ్గి, ఉత్సాహం, సానుకూల దృక్పథం పెరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శనివారం మున్సిపల్ ఉద్యోగుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కమిషనర్ క్రీడా పోటీలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. విధుల ఒత్తిడికి దూరంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. క్రీడలు ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్, కౌన్సిల్ హాల్, ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ స్టేడియంలలో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. పురుష ఉద్యోగుల కోసం క్రికెట్, షటిల్, వాలీబాల్, క్యారమ్స్, చెస్, క్రీడలు, మహిళా ఉద్యోగుల కోసం త్రోబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, షటిల్ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహించి, సంక్రాంతి పండుగ నాడు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. 

జట్టు స్పూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన పోటీ భావన ఉద్యోగుల పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొంటూ, మున్సిపల్ ఉద్యోగులందరూ ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిసిపి వెంకటరమణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, ఆర్‌ఓ జునైద్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
మహిళల భద్రత - భరోసా కేంద్రాలు
మహిళలకు రక్షణగా నిలుస్తున్న తెలంగాణ భరోసా కేంద్రాలుకంటెంట్: బాధితులైన మహిళలు, పిల్లలకు న్యాయం,...
By Kalaga Sailaja 2026-06-29 05:11:52 0 58
Andhra Pradesh
గర్భిణులకు ఆరోగ్య భరోసా – ‘హెచ్‌ఎన్‌వీఎంపీ’ కార్యక్రమం నిర్వహణ
కాకినాడ జిల్లా కొత్తపూడి పీహెచ్‌సీ సెంటర్‌లో సోమవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ...
By Ratna Sekhar 2026-02-18 09:01:03 0 388
Telangana
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ తెలంగాణలో మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40...
By Pinnehasan Odela 2026-03-06 06:38:45 0 216
Media Academy
🎯 Why a Media Academy Matters Today
🎯 Why a Media Academy Matters Today With technology revolutionizing communication, journalists...
By Media Academy 2025-05-03 12:41:11 0 4K
Telangana
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన DTDO శ్రీ జాదవ్ అంబాజీకి ఘన సన్మానం
ఆసిఫాబాద్, జులై 22 భారత్ ఆవాజ్ ప్రతినిధి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నూతన గిరిజన అభివృద్ధి అధికారి...
By Chunarkar Jagadeesh 2026-07-22 12:19:02 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com