ఏపీలో భారీగా సంక్రాంతి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే

0
235

2026 నూతన సంవత్సరం వచ్చేసింది. జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ భారీగా సెలవును మోసుకొచ్చింది. ఏపీలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండక్కి భారీగా సెలవులను ప్రకటించింది. జనవరి 2026 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం జనవరిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏకంగా తొమ్మిది రోజులు సెలవులు వచ్చాయి. ఏపీలో సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఉద్యోగ, వ్యాపార, విద్య వంటి కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు సంక్రాంతికి తమ సొంతూళ్లకు చేరుకుని స్నేహితులు, కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రాండ్‌గా పండుగను జరుపుతారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. 14వ తేదీ భోగి , 15వ తేదీ మకర సంక్రాంతి , 16వ తేదీ కనుమ, 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సెలవులు ఉన్నాయి. ఇక ఆప్షనల్ హాలీడేస్‌లో హజ్రత్ అలీ జయంతి, 16వ తేదీన షబ్-ఎ-మెరాజ్ ఉన్నాయి. విద్యార్థులకు జనవరిలో మొత్తం 13 సెలవులు వచ్చాయి. సంక్రాంతికి ఏకంగా 9 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక ఆదివారాలను కలిపితే మొత్తం 13 రోజులు స్కూళ్లు బంద్ కానున్నాయి. సంక్రాంతి పండుగకు ముందు వెనుక కలిపి.. విద్యార్థులకు అదనంగా 12, 13, 17వ తేదీల్లో సెలవులు ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ బదిలీ
రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ కొత్త మాస దినేష్ కుమార్ ను బదిలీ చేసినట్లు విశ్వ నీయ వర్గాల ద్వారా...
By Mobbu Venkatramana 2026-03-23 12:45:58 0 467
Bharat Aawaz
ANTI DRUG AWARENESS PRORAME
Student Awareness Program Held at HMT Nagar Lake Park Nacharam Police Conduct Anti-Drug, Traffic...
By Shaik Baba 2026-09-16 13:53:37 0 100
BMA
Takedown Threats: Media Fights Three-Hour Gag Orders
The newly introduced Sahyog portal allows governments to send aggressive takedown requests to...
By JoinBMA 2026-08-20 07:35:57 0 116
BMA
Defying Draconian Laws: The Courage of the Reporter
The psychological and moral strength of the press is most visible when journalists endure extreme...
By JoinBMA 2026-08-21 10:34:07 0 133
Telangana
మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం
మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్...
By Avunoori Mahesh 2026-06-14 10:31:19 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com