దాడికి గురైన బాధితుడు తరుపున అండగా నిలబడ్డ బి సి నాయకులు... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

0
350

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురై గాయలతో బాధపడుతున్న ముత్తిన రామకృష్ణ యాదవ్ ని, వారి కుటుంబ సభ్యులను జిల్లా BC సంఘం నాయకులు పాతకొత్తూరు వారి నివాసానికి విచ్చేసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని నాన్- బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, కేసును పక్కదారి పట్టించే విధంగా చెయ్యొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక మనిషిపై ఇంత దారుణంగా, విచక్షణారహితంగా దాడి చేసిన దోషులను రక్షించే ప్రయత్నాలు జిల్లాలో ఉన్న ప్రముఖ, స్థానిక ప్రజా ప్రతినిధులు కేసు నీరుగారిచే ప్రయత్నాలు మానుకోవాలని, వారిని వెనకేసి వస్తే ఊరుకునేది లేదని బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని న్యాయం దక్కదేమో అని ఆందోళనలో ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు బిసి సంఘాలు ఆధర్వ్యంలో ఉద్యమం చేపడతామని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది...

ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బాధితుడు లేవలేని పరిస్థితుల్లో ఉన్న మంచంపైనుండే తమ ఇంటికి వచ్చిన జిల్లా BC నాయకులకు చెప్పడం జరిగింది.. ఈ బాధితుడుని పరామర్శించిన వారిలో తెలుగు జనతా పార్టీ వ్యస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు యాదవ్, అల్లి రాజుబాబు యాదవ్, జిల్లాలో ఉన్న BC సంఘ నాయకులు, కత్తిపూడి, సీతంపేట గ్రామాలకు సంబంధించిన పలువురు పెద్దలు, యాదవ్ సోదరులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.. తరువాత మంచంపై ఉన్న బాధితుడిని తీసుకుని తేటగుంట యనమల రామకృష్ణుడు గారి క్యాంప్ కార్యాలయానికి తీసుకునివెళ్లి నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని కోరారు... #Dadala Babji

Search
Categories
Read More
Telangana
Exhibition
From January 1st 2026 exhibition opening. 
By G k Nookala 2025-12-29 14:21:22 0 351
Telangana
బుధవారం దర్శనం బంద్
ములుగు, డిసెంబర్ 23 (భారత్ అవాజ్) : ములుగు జిల్లాలోని  మేడారంలో కొలువైన సమ్మక్క-సారలమ్మ ఆలయ...
By Bheeshman King 2025-12-23 07:28:51 0 557
Manipur
Manipur Strengthens Disaster Management and Resilience
Manipur has continued to strengthen its disaster management framework through improved...
By Fathima Safa 2026-07-01 10:25:06 0 199
Telangana
సింగరేణి టెండర్ల సెగ.. పాలేరు మాజీ MLA
పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సింగరేణి బొగ్గు...
By Krishna Balina 2026-02-02 09:16:41 0 256
Telangana
అల్వాల్ మచ్చ బొల్లారం కు చెందిన కిలాడి లేడిని అరెస్ట్ చేసిన వారసుగూడ పోలీసులు
సికింద్రాబాద్.. మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడీ...
By Sidhu Maroju 2025-05-31 20:45:16 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com