భవన నిర్మాణాల వ్యర్ధాల నిర్వహణ మరింత సమర్థంగా చేపట్టాలి :: కమిషనర్

0
180

కర్నూలు : కర్నూలు సిటీ : 

భవన నిర్మాణాల వ్యర్థాల నిర్వహణ పటిష్టం

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

నగరంలో సి & డి (కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్) వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. బుధవారం కమిషనర్ తన క్యాంపు కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సి & డి వేస్ట్ మేనేజ్మెంట్‌ విధానంపై సమావేశం నిర్వహించారు. నగర సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణకు సి & డి వ్యర్థాల నిర్వహణ కీలకమని పేర్కొన్నారు. నిర్మాణ, కూల్చివేత పనుల నుంచి వచ్చే సి & డి వ్యర్థాలను ప్రజలు ఎక్కడబడితే అక్కడ పడేయకుండా యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. సి & డి వ్యర్థాల సేకరణ, తరలింపుకు ట్రాక్టర్‌కి రూ‌.500 చొప్పున ప్రకారం నామమాత్రపు రవాణా చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు, అధికారికంగా నియమిత వ్యవస్థ ద్వారానే తరలించాలని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు సి & డి వ్యర్థాలను తరలించడం అనుమతించబోమని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు.
ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన...
By Pagadala Venkateswar 2026-02-27 09:07:40 0 144
Telangana
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గ...
By Nookapangu Manikanta 2026-04-10 12:26:52 0 426
Andhra Pradesh
దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు
*దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష*    *Jan 21st, 2026*  ...
By Rajini Kumari 2026-01-21 14:58:53 0 165
Uttar Pradesh
UP's MSME and ODOP Drive Strengthens Local Industries
Uttar Pradesh continues to strengthen its Micro, Small and Medium Enterprises (MSME) sector...
By Fathima Safa 2026-06-27 05:12:59 0 39
Telangana
మే 2 నుంచి మొక్కజొన్న కొనుగోలు తాత్యలిక నిలిపివేత...
నర్సంపేట మార్కెట్ యార్డుకు మక్కజొన్నలు తీసుకురావొద్దుయార్డులో 1.30 లక్షల బస్తాలు నిల్వ, స్థలం...
By Gujile Ramu 2026-04-30 13:46:16 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com