నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థి భర్తీ చేయాలి గిరిజన ప్రజా సంఘాలు

0
245

*నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థినికి భర్తీ చేయాలి - గిరిజన ప్రజా సంఘాల జేఏసీ*

 

విజయవాడ: కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తుందని గిరిజన ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షులు మానుపాటి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గిరిజనుల తలరాతలు మారడం లేదన్నారు. రాజ్యాంగంలో ఎస్టీలకు ఇచ్చిన హక్కులకు ప్రభుత్వాలు గండి కొడుతున్నాయన్నారు. నెల్లూరులో మేయర్ పదవి ఎస్టీకి రాజ్యాంగబద్ధంగా కేటాయించబడిందని, గత ప్రభుత్వంలో గిరిజన మహిళ మేయర్ పదవిలో కొనసాగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో గిరిజన మహిళపై దాడుల నేపథ్యంలో రాజీనామా చేస్తే ఇంతవరకు మేయర్ పదవిని కుట్రపూరితంగానే భర్తీ చేయలేదన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఎస్టీ అభ్యర్థితో మేయర్ పదవిని భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గిరిజనుల పై దాడులు ఆపాలన్నారు. లేకుంటే గిరిజన సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏ.వై.హెచ్.పి.ఎస్ జాతీయ అధ్యక్షులు ఎన్.ధర్మ, జేఏసీ నేతలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అస్తి పన్ను పై 50 శాతం వడ్డీ తగ్గింపు- గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ నిర్ణయం
   గ్రేటర్   విశాఖ   మహా నగర   పాలక సంస్థ కమిషనర్ వారు...
By Mobbu Venkatramana 2026-03-23 11:48:17 0 520
Bharat Aawaz
రాజకీయ వ్యభిచారం ⭐ Right To Recall
https://youtu.be/WgtnvQrJPPM
By Hazu MD. 2025-08-19 09:24:05 0 2K
Andhra Pradesh
Madanapalle: రామసముద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. రూ. 11,200 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం. చట్టవిరుద్ధ పనులపై ఎస్సై హెచ్చరిక.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండల కేంద్రం శీతరగానిపల్లె సమీపంలో...
By Pagadala Venkateswar 2026-07-20 11:32:59 0 112
Andhra Pradesh
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ  కేంద్ర ఆరోగ్య,
పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ...
By SivaNagendra Annapareddy 2025-12-28 05:12:49 0 671
Andhra Pradesh
మదనపల్లిలో ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి –STU నిరసన.
శుక్రవారం మదనపల్లెలో స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్...
By Pagadala Venkateswar 2026-02-13 11:00:26 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com