కత్తిపూడి బాధితుడు ముత్తిన రామకృష్ణను పరామర్శించిన BCY పార్టీ అనూష యాదవ్

0
423

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురైన ముత్తిన రామకృష్ణను బీసీవై పార్టీ నాయకురాలు డాక్టర్ అనూష యాదవ్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబానికి చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక మనిషిపై విచక్షణారహితంగా దాడి చేసిన దోషులను రక్షించే ప్రయత్నాలు జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రజా ప్రతినిధులు కేసు నీరుగారిచే పనిలో నిమగ్నం అవ్వడం వలన బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని న్యాయం దక్కదేమో! అని ఆందోళనలో ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు తను అన్ని విధాల అండగా ఉంటానని అనూష యాదవ్ అన్నారు. 

 

ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్ బాధితుడే స్వయంగా ఫోన్లో వివరించగా, బాధిత కుటుంబానికి తోడుగా ఉంటానని అవసరమైన సందర్భంలో కత్తిపూడి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తిపూడి, సీతంపేట గ్రామాలకు సంబంధించిన పలువురు పెద్దలు, యాదవ్ సోదరులు పాల్గొన్నారు.. #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
పల్స్ పోలియో రెండు చుక్కలు జీవితాంతం రక్షణ అయ్యన్నపాత్రుడు
 *రెండు చుక్కలు - జీవితాంతం రక్షణ: గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు*   ...
By Rajini Kumari 2025-12-21 13:58:24 0 274
Andhra Pradesh
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4...
By Chennaiah Kati 2026-07-23 15:52:30 0 229
Andhra Pradesh
Bhogapuram airport ready to inauguration
ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమవబోతోంది. రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమవబోతోంది....
By G k Nookala 2026-07-10 12:13:36 0 153
Puducherry
Puducherry Rolls Out Financial Inclusion Campaign Across Panchayats
From July 1 to September 30, Puducherry is implementing a Financial Inclusion Saturation Campaign...
By Bharat Aawaz 2025-07-17 11:22:40 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com