హాస్టల్స్‌లో వసతుల జిఓ 46 ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

0
462

హాస్టల్స్‌లో వసతుల జిఓ 46 ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

అమరావతి : రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్స్‌లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రతి 15 రోజులకోసారి సంక్షేమ హాస్టళ్లను సందర్శించి రాత్రి అక్కడ బస చేయాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జిఓ 46ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. హాస్టళ్లలోని పిల్లలకు తాగునీరు ఎప్పటిలోగా అందిస్తారో చెప్పాలని ఆదేశించింది. 320 కొత్త ఆర్ఒ ప్లాంట్లు మంజూరయ్యాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే అవి సరిపోవని అభిప్రాయపడింది. హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సంక్షేమ శాఖల అధికారులకు చోటు కల్పించాలంది. సిఎస్‌ స్వయంగా పర్యవేక్షణ చేయాలంది. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పన ఉండాలంది. తాగునీరు, మరుగుదొడ్ల తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక రూపొందిచాలంది. హాస్టల్స్‌లో వసతులు లేవంటూ కాకినాడ జిల్లాకు చెందిన కె అఖిల్‌ శ్రీగురుతేజ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది.
పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం హాస్టళ్లలో 86 మంది విద్యార్థులు కామెర్ల సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఒకరు మరణించారు. మరో 150 మంది విద్యార్థులు ఇతర సమస్యలతో ఆస్పత్రిపాలయ్యారు. దీనిపై హైకోర్టు, విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శితో నివేదిక తెప్పించుకుంది. బావిలోని నీటిని నేరుగా నీళ్ల ట్యాంకుకు పంపించి వాటినే విద్యార్థులు తాగునీరుగా వినియోగించారని నివేదికలో పేర్కొంది. 611 మంది విద్యార్థులకు 58 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, ఇందులో 40 దొడ్లను వ్యాధి ప్రబలిన తర్వాతే కట్టారని నివేదికలో ఉంది. 11 మరుగుదొడ్లకు, 2 స్నానపు గదులకు తలుపులు కూడా లేవని ఉంది. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు.. సిఎస్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,...
By Chennaiah Kati 2026-06-20 11:51:12 0 115
Andhra Pradesh
యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ప్రశాంతి రెడ్డి
కాకాని, నల్లపురెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాలో యూరియా...
By Pagadala Venkateswar 2026-06-13 11:28:54 0 117
Telangana
మల్కాజిగిరిలో బీజేపీ SIR అవగాహన సదస్సు.. కాంగ్రెస్, ఎంఐఎంపై ఈటల విమర్శలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ...
By Sidhu Maroju 2026-06-23 08:07:55 0 218
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వృద్ధుడు
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు....
By Kothuru Murali 2026-01-05 13:06:24 0 244
Telangana
"అల్వాల్ పోలీసుల ఘనత: 18 గంటల్లోనే దొంగను పట్టి, బంగారం రికవరీ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు...
By Sidhu Maroju 2026-04-22 17:33:32 0 365
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com