వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా సావిత్రీ బాయి పూలే జ‌యంతి వేడుకలు.

0
259

జ‌యంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, పార్టీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షులు న‌ల‌మారు చంద్ర‌శేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షులు నారాయ‌ణ మూర్తి, బీసీ సెల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ద‌స్త‌గిరితోపాటు ప‌లు పార్టీ విభాగాలనాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను హాజరు. 

- సావిత్రీ బాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం

- మహిళాభ్యుదయం, మహిళా సాధికారత సాధనలో ఆమె సేవలు చిరస్మరణీయం : వైయస్సార్సీపీ నేతలు

తాడేప‌ల్లి:

మ‌హిళ‌ల్లో అక్ష‌రాస్య‌త పెంచ‌డం ద్వారా మహిళాభ్యుదం, సాధికార‌త సాధ్య‌మ‌ని గ్ర‌హించి అందుకోసం పాటుబ‌డిన మ‌హ‌నీయురాలు సావిత్రీబాయి పూలే అని వైయస్సార్సీపీ నాయ‌కులు కొనియాడారు. సావిత్రీబాయి పూలే జ‌యంతి సందర్భంగా తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ నాయ‌కులు ఆమె చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రీ బాయి పూలే ఆశ‌యాల‌కు అనుగుణంగానే గ‌త వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యారంగంలో మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు వినూత్న మార్పులు తీసుకురావ‌డ‌మే కాకుండా మహిళ‌ల‌ను ఉన్న‌త స్థానాల్లో నిల‌బెట్టి రాజ‌కీయంగా ప్రోత్స‌హించార‌ని గుర్తు చేశారు. ఆఖ‌రి శ్వాస వ‌రకు కూడా ప్ర‌జా సేవ‌లోనే గ‌డిపిన సావిత్రీ బాయి జీవితం నేటి రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆద‌ర్శ‌మ‌న్నారు. ఎన్నో అవ‌మానాలు, అవ‌రోధాల‌ను దాటుకుని భ‌ర్త స‌హకారంతో మహిళ‌ల కోసం విద్యాల‌యాలు స్థాపించి వారి అభ్యున్న‌తి కోసం కృషి చేశార‌ని చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కత్తిపూడిలో డ్రైవర్లు నిర్లక్ష్యం.. రెండు లారీలు ఢీకొనడంతో సంబవించిన ప్రమాదం.. మంటల్లో క్లీనర్ మృతి..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారు రావికంపాడు వెళ్ళు జంక్షన్ వద్ద గురువారం...
By BABJI DADALA 2026-01-29 02:18:49 0 624
Andhra Pradesh
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:35:17 0 294
Bharat Aawaz
Justice for Every Indian – A Call We Can’t Ignore
Fake Encounter or Miscarriage of Justice in Punjab? Two young men, Jaspreet Singh and Ram...
By Citizen Rights Council 2025-07-10 13:24:34 0 1K
Andhra Pradesh
మద్యం షాపుల రెన్యూవల్: ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సిందేనన్న హైకోర్టు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) రుసుము వివాదంపై...
By Pagadala Venkateswar 2026-09-19 06:46:35 0 44
Andaman & Nikobar Islands
Great Nicobar Island Project Sparks Intense National Debate
India’s mega-development plan for the Great Nicobar Island (GNI) is taking center stage in...
By Dunna Jessicaruth 2026-05-16 05:16:56 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com